రేపు కర్నూలు జిల్లా బంద్‌

21 May, 2017 15:29 IST|Sakshi
రేపు కర్నూలు జిల్లా బంద్‌

హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పత్తికొండ సమన్వయ కర్త చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యను వైఎస్‌ఆర్‌సీపీ ఖండించింది. ఈ హత్య వెనుక సీఎం చంద్రబాబు, మంత్రి కేఈ కృష్ణమూర్తి ఉన్నట్లు ఆరోపించింది. ఈ మేరకు వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజల మనసు గెలవడం చేతకానీ ప్రభుత్వం, గత మూడేళ్లుగా రాష్ట్రంలో అరాచకపాలన సాగిస్తూ చివరికి ఇలా హత్య రాజకీయాలకు తెరలేపిందని వ్యాఖ్యానించింది.

భయానక వాతావరణం సృష్టించి ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని పేర్కొంది. నారాయణ రెడ్డి హత్యతో ఏపీలో పాలన ఉగ్రవాద స్ధాయికి మారిందని వ్యాఖ్యానించింది. హత్యకు నిరసనగా సోమవారం కర్నూలు జిల్లా బంద్‌కు పార్టీ పిలుపునిచ్చింది. నారాయణ రెడ్డి హత్య వార్తను తెలుసుకున్న వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి కడప పర్యటనను రద్దు చేసుకున్నారని తెలిపింది. సోమవారం జరగబోయే అంత్యక్రియలకు ఆయన హాజరవుతారని వెల్లడించింది.

మరిన్ని వార్తలు