చంద్రబాబుకు అప్పుడు గుర్తు రాలేదా: వైఎస్ జగన్

23 Dec, 2014 12:58 IST|Sakshi
చంద్రబాబుకు అప్పుడు గుర్తు రాలేదా: వైఎస్ జగన్

హైదరాబాద్ : కొల్లేరు కాంటూరు సమస్య పరిష్కారానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కొల్లేరును మూడో కాంటూరు వరకూ కుదించాలని ప్రభుత్వం మంగళవారం సభలో తీర్మానం పెట్టింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ 2008లోనే కొల్లేరుపై తీర్మానం జరిగిందరి,  కొల్లేరు కాంటూరుపై వైఎస్ రాజశేఖరరెడ్డి ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారని గుర్తు చేశారు.

కొల్లేరు ప్రాంతవాసులు జీవనాన్ని అధ్యయనం చేసేందుకు వైఎస్ఆర్  కమిటీ కూడా వేసినట్లు చెప్పారు. 2008 నాటి తీర్మానాన్నిముందుకు తీసుకు వెళ్లాలని... రాజకీయ అవసరాల కోసం మరోసారి తీర్మానమా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజలపై కాస్తోకూస్తో టీడీపీకి ప్రేమ వచ్చినందుకు సంతోషమన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుకు కొల్లేరు సమస్య గుర్తు లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో కట్టుకథలు చెప్పిస్తున్నారని విమర్శించారు.  సుప్రీంకోర్టు తీర్పుపైనే కొల్లేరులో చెరువులు ధ్వంసం అయినట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు