అభ్యర్థులను ప్రకటించే దమ్ము ఉందా?

14 Aug, 2018 13:11 IST|Sakshi
రఘురామిరెడ్డి, గోవింద రెడ్డి, సురేష్‌ బాబు (ఫైల్‌ ఫోటో)

సాక్షి, వైఎస్సార్‌ : సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా అభివృద్ది కోసం కాదని, పార్టీ అంతర్గత కలహాలను అరికట్టేందుకు మాత్రమే కడప వస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి, మేయర్‌ సురేష్‌ బాబు మండిపడ్డారు. చంద్రబాబు కడప పర్యటనకు వస్తున్న నేపథ్యంలో మంగళవారం వైఎస్సార్‌సీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఇప్పటి వరకు 25 సార్లు జిల్లాకు వచ్చారు. నాలుగేళ్లలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలైనా చేశారా? అభివృద్ది కాలేదు కాని అప్పులు మాత్రం అయ్యాయి. నెల్లూరు ప్రజలు ఛీ కొడితే దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయిన సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తమ జిల్లాపై పెత్తనం చెలాయించడం దుర్మార్గం. రైతులను మంత్రి సోమిరెడ్డి నిలువునా మోసం చేశారు. రాయలసీమ పట్ల చంద్రబాబు ఎందుకంత వివక్ష చూపుతున్నారు. ఇప్పటికిప్పుడు జిల్లాలోని జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థిని ప్రకటించే దమ్ము చంద్రబాబుకు ఉందా? తెలంగాణలో సీఎం కేసీఆర్‌ సెప్టెంబర్‌లోపు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తామని అంటున్నారు. ఆ ధైర్యం మన సీఎంకి ఉందా?’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు