అభివృద్ధి పనులకు శంకుస్థాపన

21 Sep, 2019 15:40 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజులు శనివారం తణుకు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా ఈ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు సుమారు రూ.50 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో ఇరగవరం మండంలం రేలంగి గ్రామంలో ఇతర పార్టీలకు చెందిన సుమారు 500 మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరడానికి ముందుకు వచ్చారు. దీంతో వారందరికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు, మంత్రి శీరంగనాథరాజులు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

అలాగే తణుకులో వైఎస్సార్‌సీపీ అభిమానులు నడిపిస్తున్న రాజన్న క్యాంటీన్‌ను వారు సందర్శించారు. మండలంలోని తేతలి గ్రామంలో అంగన్‌వాడీ బిల్డింగ్‌ను మంత్రి ప్రారంభించగా, తణుకు బ్యాంకు కాలనీ నందు రహదారి నిర్మాణానికి ఎంపీ శంకుస్థాపన చేశారు. సమారు 12000 మంది గ్రామ వాలంటీర్‌లతో తణుకులోని పద్మశ్రీ ఫంక్షన్‌ హాలులో సమావేశమై, అక్కడి సమస్యలపై మంత్రి శీరంగనాథరాజు, ఎంపీ ఆరా తీశారు. సంక్షేమ పథకాలు అన్నీ లబ్ధిదారులకు చేరాలని వారు ఆదేశించారు.

మరిన్ని వార్తలు