గ్రహం అనుగ్రహం (05-03-2020)

5 Mar, 2020 05:48 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి శు.దశమి ఉ.8.19 వరకు, తదుపరి ఏకాదశి నక్షత్రం ఆరుద్ర ఉ.6.56 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం సా.6.47 నుంచి 8.24 వరకు, దుర్ముహూర్తం ఉ.10.14 నుంచి 11.02 వరకు, తదుపరి ప.2.54 నుంచి 3.43 వరకు అమృతఘడియలు... తె.4.18 నుంచి 5.53 వరకు.

సూర్యోదయం :    6.21
సూర్యాస్తమయం :  6.03
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
మేషం: కొత్త వ్యవహారాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ^è ర్చలు సఫలం. విందువినోదాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహం.
వృషభం: సన్నిహితులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. «దనవ్యయం. పనుల్లో జాప్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
మిథునం: పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
కర్కాటకం: శ్రమ తప్ప ఫలితం ఉండదు. అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. వ్యాపార విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో చికాకులు.
సింహం: నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి ఒప్పందాలు. రుణవిముక్తి. సోదరులతో వివాదాలు తీరతాయి. శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.
కన్య: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోభివృద్ధి.
తుల: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. బం«ధువులతో తగాదాలు. వ్యాపారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.
వృశ్చికం: దూరప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు విస్తరణలో జాప్యం. ఉద్యోగాలలో ఒత్తిడులు.
ధనుస్సు: నూతన ఒప్పందాలు. ఆర్థిక ప్రగతి. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోగతి.
మకరం: వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు పాటిస్తారు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.
కుంభం: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధుమిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.
మీనం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేయాల్సిన పరిస్థితి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో  సమస్యలు.
– సింహంభట్ల సుబ్బారావు 

మరిన్ని వార్తలు