గ్రహం అనుగ్రహం (10-06-2020)

10 Jun, 2020 05:40 IST|Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం తిథి బ.పంచమి రా.9.43 వరకు తదుపరి షష్ఠి నక్షత్రం శ్రవణం సా.4.56 వరకు తదుపరి ధనిష్ఠ వర్జ్యం రా.9.11 నుంచి 10.50 వరకు దుర్ముహూర్తం ప.11.31 నుంచి 12.24 వరకు అమృతఘడియలు....ఉ.6.10 నుంచి 7.46 వరకు

సూర్యోదయం :    5.28
సూర్యాస్తమయం    :  6.29
రాహుకాలం :  ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

గ్రహఫలం..బుధవారం, 10.06.20
మేషం: నూతన ఉద్యోగాలు లాభిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

వృషభం: వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

మిథునం: రుణదాతల ఒత్తిడులు. పనుల్లో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కర్కాటకం: పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు.  విద్యార్థులకు కార్యసిద్ధి. వృత్తి, వ్యాపారాలు పురోగతిలో సాగుతాయి.

సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. కొత్త వ్యక్తుల పరిచయం. యత్నకార్యసిద్ధి. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు హోదాలు.

కన్య: మిత్రులు, బంధువులతో తగాదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

తుల: కుటుంబంలో కొన్ని సమస్యలు తప్పవు. అనారోగ్యం. దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

వృశ్చికం: దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం. శుభవార్తలు. వాహనయోగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

ధనుస్సు: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో ప్రతిబంధకాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మకరం: రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కుంభం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకోని మార్పులు.

మీనం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. నిరుద్యోగులకు అనుకూలం. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.

మరిన్ని వార్తలు