గ్రహం అనుగ్రహం (12-10-2019)

12 Oct, 2019 05:53 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి శు.చతుర్దశి రా.11.36 వరకు తదుపరి పౌర్ణమి, నక్షత్రం ఉత్తరాభాద్ర పూర్తి (24 గంటలు)వర్జ్యం సా.4.09 నుంచి 5.55 వరకు
దుర్ముహూర్తం ఉ.5.54 నుంచి 7.27 వరకుఅమృతఘడియలు... రా.2.44 నుంచి 3.43 వరకు.

సూర్యోదయం :    5.55
సూర్యాస్తమయం    :  5.39
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం
మేషం: పనులు నిదానిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

వృషభం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులలో పురోగతి. శుభకార్యాలు నిర్వహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కర్కాటకం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

సింహం: పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కన్య: రుణభారాలు తొలగుతాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వృశ్చికం: పనులు నత్తనడకన సాగుతాయి. ధనవ్యయం. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

ధనుస్సు: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మకరం: మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వేడుకల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కుంభం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. విద్యార్థుల యత్నాలు నిదానిస్తాయి. దూరప్రయాణాలు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

మీనం: పలుకుబడి పెరుగుతుంది. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలోవిజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.– సింహంభట్ల సుబ్బారావు

>
మరిన్ని వార్తలు