గ్రహం అనుగ్రహం (17-12-2019)

17 Dec, 2019 05:46 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి బ.షష్ఠి రా.2.51 వరకు, తదుపరి సప్తమినక్షత్రం మఖ రా.3.10 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం ప.3.50 నుంచి 5.21 వరకు, దుర్ముహూర్తం ఉ.8.38 నుంచి 9.21 వరకుతదుపరి రా.10.36 నుంచి 11.28 వరకు, అమృతఘడియలు... రా.12.51 నుంచి 2.20 వరకు.

సూర్యోదయం :    6.27
సూర్యాస్తమయం    :  5.25
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

భవిష్యం
మేషం:    పనుల్లో ప్రతిష్ఠంభన. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రమాధిక్యం. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృషభం: సన్నిహితుల నుంచి ఒత్తిళ్లు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో గందరగోళం.

మిథునం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు. భూలాభాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కర్కాటకం: మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఇంటాబయటా కొన్ని సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

సింహం: బంధువులతో సత్సంబంధాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

కన్య: కొన్ని పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం.

తుల: సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

వృశ్చికం: చాకచక్యంగా ఇబ్బందులు అధిగమిస్తారు. చేపట్టిన పనులలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఊరట.

ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యస్థితి.

మకరం: పనుల్లో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. ప్రయాణాలలో మార్పులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పనిఒత్తిడులు. ఆరోగ్యభంగం.

కుంభం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. సంఘంలో గౌరవం. భూములు, వాహనాలు కొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.

మీనం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వివాదాలు పరిష్కారమవుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.– సింహంభట్ల సుబ్బారావు

>
మరిన్ని వార్తలు