ఆదివాసి, లంబాడీల మధ్య చిచ్చు పెట్టింది వాళ్లే

3 Jan, 2018 15:43 IST|Sakshi

భద్రాద్రి కొత్తగూడెం : అడవి మీద గిరిజనులకు హక్కు లేదనటం అవివేకమని, ప్రభుత్వ పెద్దలే ఆదివాసీ, లంబాడీల మధ్య చిచ్చు పెట్టారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..ఈ విషయంపై  సీఎం కేసీఆర్‌ ఎందుకు నోరు మెదపడటం లేదని ప్రశ్నించారు. అఖిల పక్షం ఎందుకు నిర్వహించటం లేదని అడిగారు.  ఇలాంటి గొడవలు పాలక వర్గాలకు లాభమేనని, 
గతంలో మాల, మాదిగల మధ్య చిచ్చు రేపారని గుర్తు చేశారు. 

 ఆదివాసీ, లంబాడీల మధ్య సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పారు. బీసీ సబ్ ప్లాన్‌ను ఎందుకు చట్టంగా మార్చటం లేదో చెప్పాలన్నారు. రాష్ట్రంలో పాలన ప్రజలకు వ్యతిరేకంగా ఉందని, ఈ పాలనలో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. గిరిజనుల పోడు భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. సామాజిక న్యాయం కావాలని సీపీఎం కోరుతుందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ గద్దె దించటమే లక్ష్యంగా సీపీఎం ఉద్యమాలు చేస్తుందని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు