దేశంలో నిర్మాణంలో 32 కొత్త మాల్స్‌

21 Apr, 2018 00:57 IST|Sakshi

అందుబాటులోకి 1.42 కోట్ల చ.అ. రిటైల్‌ స్థలం

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో వాణిజ్య సముదాయాల హవా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయా నగరాల్లో 32 కొత్త షాపింగ్‌ మాల్స్‌ నిర్మాణంలో ఉన్నాయని.. వీటిల్లో 2020 నాటికి 1.42 కోట్ల చ.అ. రిటైల్‌ స్థలంలో అందుబాటులోకి రానుందని కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ నివేదిక తెలిపింది. ప్రస్తుతం జనవరి–మార్చి 3 నెలల కాలంలో ప్రధాన నగరాల్లో 85 లక్షల చ.అ. మాల్స్‌ స్థలం అందుబాటులోకి వచ్చిందని పేర్కొంది.

2018 తొలి త్రైమాసికంలో ప్రధాన నగరాల్లో మొత్తం 12,64,423 చ.అ. లీజింగ్‌ లావాదేవీలు జరిగ్గా.. ఇందులో 80 శాతం అంటే 10,22,345 చ.అ. స్థలం షాపింగ్‌ మాల్స్‌ లావాదేవీలేనని నివేదిక పేర్కొంది. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు నగరాల్లోని ప్రధాన ప్రాంతాల్లో 100 శాతం లావాదేవీలు జరిగాయని.. అపెరల్స్, ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ స్థల లీజింగ్‌లు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.  

మరిన్ని వార్తలు