రెండో​రోజూ విమానాల్లో జాప్యం

28 Apr, 2019 13:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌ ఇండియా చెక్‌ ఇన్‌ సాఫ్ట్‌వేర్‌ శనివారం ఐదు గంటల పాటు నిలిచిపోవడం పెను ప్రభావం చూపుతోంది. ఆదివారం రెండో రోజు సైతం 137 విమానాల రాకపోకల్లో జాప్యం నెలకొంటుందని ఎయిర్‌ ఇండియా పేర్కొంది. విమానాల సగటు జాప్యం 197 నిమిషాలుగా అంచనా వేసినట్టు ఎయిర్‌లైన్‌ ప్రతినిధి వెల్లడించారు.

కాగా, శనివారం ఉదయం 3.30 నుంచి 8.45 గంటల వరకూ ఎయిర్‌ ఇండియా పాసింజర్‌ సర్వీస్‌ సిస్టం (పీఎస్‌ఎస్‌) సాఫ్ట్‌వేర్‌ పనిచేయకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టుల్లో వేలాది ప్రయాణీకులు నిలిచిపోయారు. సాఫ్ట్‌వేర్‌ షట్‌డౌన్‌తో శనివారం 149 విమానాల్లో జాప్యం చోటుచేసుకుందని ఆ ప్రతినిధి వెల్లడించారు.

మరిన్ని వార్తలు