మారుతి కొత్త కాన్సెప్ట్ ప్యూచర్‌ ఎస్‌ లాంచ్‌

7 Feb, 2018 12:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఢిల్లీలో భారతదేశపు అతి పెద్ద ఆటో షో 2018 ది  మోటార్‌ షో  ప్రీ ఈవెంట్‌ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా  దేశీయ దిగ్గజం ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి  ఇండియాలో రూపొందించిన తమ సరికొత్త ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది.

ఈ కొత్త ఫ్యూచర్  కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌  ఎస్ కాన్సెప్ట్ ఎస్‌యూవీని  మారుతి సుజుకి ఇండియా  డిజైనింగ్ బృందం వినూత్నంగా  అభివృద్ది చేసింది.  ఎత్తైన బాడీ, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ , ఆకర్షణీయమైన  ఇంటీరియర్‌లో  సొబగులు  దీని సొంతం. ముఖ్యంగా టోటల్‌ బాడీ డిజైన్‌,  పలుచటి హెడ్ ల్యాంప్స్‌తోపాటు మారుతి ఇప్పటి వరకు పరిచయం చేయని ఫ్రంట్ గ్రిల్ , ముందు వైపు అద్దం చుట్టూ ఉన్నతెలుపు రంగు పట్టీని అమర్చింది. ఇంకా ఫ్రంట్ బంపర్ క్రింద  సిల్వర్ బాష్ ప్లేట్ , రౌండ్‌  ఫాగ్ ల్యాంప్స్ ,బాడీ కలర్,   బ్లాక్ అల్లాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా  నిలవనున్నాయి. డోర్ ట్రిమ్స్, సీట్లు, స్టీరింగ్ వీల్, ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, డ్యాష్ బోర్డ్ సహా పలు ఇతర ఇంటీరియర్ ఫీచర్లు ఆరెంజ్ లో తీర్చిదిద్దింది. కాంపాక్ట్ కార్లు వినియోగదారుల సహజ ఎంపికగా ఉందని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్  సీఎండీ   కెన్చి అయుకవా చెప్పారు. బోల్డ్, డైనమిక్‌గా తమడిజైనర్లు ఈ బ్రాండ్ కొత్త రూపాన్ని సృష్టించారని తెలిపారు.

కాగా ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2018లో ఈ సారి 37 వాహన తయారీ సంస్థలు ,  ఆటోమొబైల్ ఆధారిత పలు కంపెనీలు తమ ఉత్పత్తులను ఆవిష్కరించనున్నాయి.  ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు  వివిధ కంపెనీలకార్లు, బైకులు, బస్సులు, ట్రక్కులు  ఎన్నో కొత్త వాహనాలు సందడి  చేయనున్నాయి.

మరిన్ని వార్తలు