వీల్‌ఛైర్ యూజర్లకు సరికొత్త కారు డిజైన్.. ఆనంద్ మహీంద్రా ట్విట్ వైరల్

12 Nov, 2023 20:13 IST|Sakshi

వీల్‌ఛైర్ వినియోగదారులు కారును ఉపయోగించడం ఇబ్బందితో కూడుకుని ఉంటుంది.  ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కార్లు వారికోసం ప్రత్యేకంగా డిజైన్ చేయలేదు కాబట్టి.. మరొకరి సహాయం అవసరమవుతుంది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో వీల్ ఛైర్ వినియోగదారులు కారు ఉపయోగించే సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ వీడియో వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను అమితంగా ఆకర్షించింది. 

"సూపర్ స్మార్ట్. ఉపయోగకరమైన డిజైన్. మా వాహనాలు ఈ ఫిట్‌మెంట్‌లను అందించగలిగితే నేను ఎంతో గర్వంగా భావిస్తాను. కానీ భారీ ఉత్పత్తిలో నిమగ్నమైన సంస్థలకు అలా చేయడం కష్టం. ఇందుకు స్టార్టప్ అవసరం. అలాంటి స్టార్టప్‌లకు నేను తప్పకుండా పెట్టుబడి పెడతాను." అని ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను షేర్ చేశారు.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వీల్‌ఛైర్ వాడేవారికి కూడా కొత్త డిజైన్‌లను తీసుకురావాలనే ఆలోచనపై హర్షం వ్యక్తం చేశారు. వీడియోలో చూపిన కారు డిజైన్‌ను ప్రశంసించారు. అలాంటి స్టార్టప్‌లు ముందుకు రావాలని కోరారు. వీల్‌ఛైర్ వినియోగదారులు కూడా ఎవరి సహాయం లేకుండా కారులో ప్రయాణించాలని ఆకాంక్షించారు.  

ఇదీ చదవండి: ఇదేందయ్యా ఇది.. రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొన్న విమానం.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు