క్రియేటర్లకు యూట్యూబ్‌ భారీ షాక్‌!

16 Nov, 2023 13:04 IST|Sakshi

క్రియేటర్లకు ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ దిగ్గజం యూట్యూబ్‌ భారీ షాకిచ్చింది. చాట్‌జీపీటీ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఏఐ వినియోగం రోజురోజుకి పెరిగిపోతుంది. అయితే, దీన్ని ఆసరాగా చేసుకుంటున్న పలువురు వీడియో క్రియేటర్లు ఏఐ సాయంతో వీడియోలు చేస్తున్నారు. డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశంపై యూట్యూబ్‌ కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. 

ఏఐ యాప్స్‌తో చేసే కంటెంట్‌కు యూట్యూబ్‌లో చోటు లేదని స్పష్టం చేసింది. వీడియోల నుంచి ఏఐ ఇమేజెస్‌ వరకు యూట్యూబ్‌ వీడియోల్లో వినియోగించడానికి వీలు లేదని తెలిపింది. ఇందుకోసం కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపింది. ఒకవేళ ఏఐ ఫోటోలు, వీడియోల్ని వినియోగిస్తే సదరు యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకులు తప్పని సరిగా ఈ కంటెంట్‌ ఏఐతో చేసినట్లు తెలపాలి. 

లేదంటే ఆయా వీడియోలను తొలగించనున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా యూట్యూబ్‌ బ్లాగ్‌లో మార్గదర్శకాలపై సమాచారం ఇచ్చింది. యూజర్లు కంటెంట్‌ వీక్షిస్తున్న సందర్భంలో ఈ కంటెంట్‌ను ఏఐ సహాయంతో సృష్టించినట్లు చెబుతుందని పేర్కొంది.

డిస్క్రిప్షన్‌లో ఏఐ లేబుల్‌కు ఆప్షన్‌ ఉంటుందని పేర్కొంది. కొత్త మార్గదర్శకాలను పాటించని కంటెంట్‌ క్రియేటర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కంటెంట్‌ను తొలగించడంతో పాటు ఆయా ఛానెల్స్‌కు సంబంధించి మానిటైజేషన్‌ నిలిపివేయనున్నట్లు స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తలు