కారు.. కుదేలు..!

14 Aug, 2019 11:06 IST|Sakshi

జూలైలో విక్రయాలు 19% డౌన్‌

19 ఏళ్లలో ఇదే భారీ  క్షీణత

15,000 ఉద్యోగాలకు కోత

సియామ్‌ గణాంకాల్లో వెల్లడి

ప్యాకేజీ కోసం పరిశ్రమ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: వాహనాలకు డిమాండ్‌ మందగించడం ఆటోమొబైల్‌ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. జూలైలో వాహన విక్రయాలు ఏకంగా 18.71 శాతం క్షీణించాయి. గడిచిన 19 ఏళ్లలో ఇంత భారీగా అమ్మకాలు పడిపోవడం ఇదే తొలిసారి. ఈ పరిణామాలతో ఆటోమొబైల్‌ రంగంలో ఉద్యోగాల్లో కూడా కోత పడుతోంది. గడిచిన రెండు–మూడు నెలల్లో సుమారు 15,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. భారతీయ ఆటోమొబైల్‌ తయారీ సంస్థల సమాఖ్య (సియామ్‌) విడుదల చేసిన గణాంకాల ప్రకారం వివిధ రకాల ప్యాసింజర్‌ వాహనాలు, ద్విచక్ర వాహనాల విక్రయాలు ఈ ఏడాది జూలైలో మొత్తం 18,25,148 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది జూలైలో వాహనాల అమ్మకాలు 22,45,223 యూనిట్లు. దేశీయంగా గతంలో 2000 డిసెంబర్‌లో చివరిసారిగా ఆటోమొబైల్‌ విక్రయాలు ఏకంగా 21.81 శాతం మేర పడిపోయాయి. ఆ తర్వాత ఇంత భారీ స్థాయిలో క్షీణించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ప్రభుత్వం తక్షణం ప్యాకేజీ ప్రకటించాలి..
‘ప్రభుత్వం తక్షణం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. అమ్మకాలను పెంచుకునేందుకు పరిశ్రమ ప్రయత్నాలన్నీ చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా తన వంతుగా ఎంతో కొంత తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది‘ అని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ విష్ణు మాథుర్‌ తెలిపారు. సుమారు 15,000 మంది ఉద్యోగాలు (తాత్కాలిక, క్యాజువర్‌ వర్కర్లు) కోల్పోయారని ఆయన చెప్పారు. ఆటోమోటివ్‌ పరికరాల తయారీ రంగంలో మరో పది లక్షల మంది దాకా ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొందన్నారు. అమ్మకాలు పడిపోవడంతో సుమారు 300 డీలర్‌షిప్‌లు మూతబడ్డాయని మాథుర్‌ చెప్పారు.  తయారీ జీడీపీలో ఆటోమొబైల్‌ పరిశ్రమ వాటా దాదాపు సగం ఉంటుందని, ప్రత్యక్షంగా.. పరోక్షంగా 3.7 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని మాథుర్‌ వివరించారు. ఈ పరిశ్రమ గానీ పతనమైతే జీడీపీ వృద్ధి కూడా మందగిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో వాహన కొనుగోలు వ్యయాన్ని తగ్గేలా, అమ్మకాలకు ఊతం లభించేలా కేంద్రం జీఎస్‌టీని తాత్కాలికంగానైనా తగ్గించాలని పరిశ్రమ కోరుతున్నట్లు మాథుర్‌ చెప్పారు. వాహనాల స్క్రాపేజీ పాలసీ ప్రవేశపెట్టడం, రుణ లభ్యత పెంపు, వాహన రిజిస్ట్రేషన్‌ ఫీజు పెంపు ప్రతిపాదన వాయిదా తదితర విజ్ఞప్తులను ప్రభుత్వం ముందుంచినట్లు ఆయన వివరించారు.

పాసింజర్‌ వాహన విక్రయాలు 31% డౌన్‌..
n గతేడాది జూలైలో పాసింజర్‌ వాహనాల (పీవీ) అమ్మకాలు 2,90,031 యూనిట్లుగా నమోదు కాగా.. ఈ ఏడాది జూలైలో ఏకంగా 30% పడిపోయి 2,00,790 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇది కూడా 19 ఏళ్లలో భారీ క్షీణత. వరుసగా 9 నెలల పాటు పీవీల అమ్మకాలు తగ్గినట్లయింది. చివరిసారిగా 2000 డిసెంబర్‌లో పీవీ అమ్మకాలు 35.22% పడిపోయాయి.  
n ప్యాసింజర్‌ కార్ల విషయానికొస్తే గత జూలైలో 1,91,979 కార్లు అమ్ముడవగా.. ఈ ఏడాది జూలైలో 36% క్షీణించి 1,22,956 యూనిట్లకు తగ్గాయి. 2000 డిసెంబర్‌లో ఈ క్షీణత 39.86 శాతం.  
n ద్విచక్ర వాహనాల విభాగంలో హీరో మోటోకార్ప్‌ అమ్మకాలు 22.9 శాతం క్షీణించి 5,11,374 యూనిట్లకు తగ్గాయి. అటు పోటీ సంస్థ హోండా మోటార్‌సైకిల్‌  విక్రయాలు కూడా సుమారు 11% తగ్గి 4,55,036 యూనిట్లకు, టీవీఎస్‌ మోటార్‌ అమ్మకాలు 16% క్షీణించి 2,08,489 యూనిట్లకు పరిమితమయ్యాయి.  
n పీవీ సెగ్మెంట్‌లో మారుతీ సుజుకీ అమ్మకాలు జూలైలో సుమారు 37% క్షీణించి 96,478 యూనిట్లకు తగ్గాయి. హ్యుందాయ్‌  ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌) 10 శాతం క్షీణతతో 39,010 యూనిట్లు, మహీంద్రా అండ్‌ మహీంద్రా సుమారు 15% క్షీణతతో 16,830 యూనిట్లే విక్రయించగలిగాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అదుపులోనే రిటైల్‌ ధరల స్పీడ్‌

కార్స్‌24లో ధోనీ పెట్టుబడి

సుంకాలు వాయిదా, లాభపడుతున్న రూపాయి 

లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు 

రిలయన్స్‌ గర్జన.. మార్కెట్‌ బేర్‌!

రూపాయి 38 పైసల నష్టం

నష్టాల ప్రారంభం, రిలయన్స్‌ జూమ్‌ 

తులం బంగారం రూ.74 వేలు

ముకేశ్‌.. మెగా డీల్స్‌!

రిలయన్స్ ఇండస్ట్ర్రీస్..మరో సంచలనం

కశ్మీర్‌లో పెట్టుబడులకు సిద్ధం: ముకేశ్‌ అంబానీ

అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ

రిలయన్స్‌తో సౌదీ ఆరామ్కో భారీ డీల్‌

జియో ఫైబర్‌ సంచలనం: బంపర్‌ ఆఫర్లు

స్టార్టప్‌లకు ఆర్‌ఐఎల్‌ బొనాంజా

ఇండియా, రిలయన్స్‌ రైజింగ్‌.. ఎవ్వరూ ఆపలేరు!

రిలయన్స్‌ ఏజీఎం : బంపర్‌ ఆఫర్లు?!

ఎయిర్‌టెల్‌పై సాఫ్ట్‌బ్యాంక్‌ కన్ను

మార్కెట్లకు సెలవు

నష్టాలొస్తున్నాయి.. సిప్‌లు ఆపేయాలా?

బాకీల వేటలో బీఎస్‌ఎన్‌ఎల్‌

ఎవరు.. ఏ ఫారం దాఖలు చేయాలి.. 

‘పన్ను’కు టైమైంది..

‘స్పేస్‌’ సిటీ!

ఓ మ్యాన్‌..నా వీకెండ్‌ మొదలైంది

రైల్వే ఇ-టికెట్లపై ఛార్జీల మోత

హాస్పిటల్‌ రంగంలోకి ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా

85 ఏళ్ల వరకు కవరేజీ 

పన్ను ఊరట కల్పించండి: ఎఫ్‌పీఐల వినతి

ఆంధ్రా బ్యాంక్, కెనరా బ్యాంక్‌ రుణరేట్ల తగ్గింపు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నేను పెళ్లే చేసుకోను!

హీరో దంపతుల మధ్య వివాదం?

జెర్సీ రీమేక్‌లో అమలాపాల్‌!

ప్రేమకథ మొదలు

‘ఎవరూ నమ్మనప్పుడు పీవీపీగారు నన్ను నమ్మారు’

నాకు తెలిసిందే తీస్తా!