వరల్డ్‌కప్‌ ఫైనల్ మ్యాచ్‌‌కు ముందే కొత్త కారు కొన్న ఆస్ట్రేలియా క్రికెటర్ - వీడియో వైరల్

19 Nov, 2023 16:47 IST|Sakshi

Matthew Hayden Mahindra Scorpio N: మహీంద్రా కార్లను సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తూ ఉంటారు. దేశీయ విఫణిలో విడుదలైన అతి తక్కువ కాలంలో మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్లిన 'మహీంద్రా స్కార్పియో ఎన్' (Mahindra Scorpio N) ఎస్‌యూవీని మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ 'మాథ్యూ హేడెన్' (Matthew Hayden) కొనుగోలు చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆస్ట్రేలియాలో భారతీయ కార్ల తయారీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియన్ క్రికెట్ లెజెండ్ మాథ్యూ హేడెన్ ఇటీవల తన గ్యారేజీకి 'స్కార్పియో ఎన్' జోడించాడు. దీనికి సంబంధించిన వీడియోను మహీంద్రా ఆస్ట్రేలియా యూట్యూబ్ ఛానెల్ ద్వారా షేర్ చేశారు.

ఈ వీడియోలో మాథ్యూ హేడెన్ క్వీన్స్‌ల్యాండర్ బ్రిస్బేన్‌లోని మహీంద్రా డీలర్‌షిప్ చుట్టూ తిరుగుతూ, ఎవరెస్ట్ వైట్ కలర్ స్కీమ్‌ కలిగిన స్కార్పియో-ఎన్ డెలివరీ తీసుకోవడం చూడవచ్చు.

మహీంద్రా స్కార్పియో-ఎన్
ప్రారంభం నుంచి ఉత్తమ అమ్మకాలను పొందుతున్న మహీంద్రా స్కార్పియో ఎన్ ప్రారంభ ధర రూ. 13.26 లక్షలు, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 22.78 లక్షలు (ఎక్స్-షోరూమ్).  వేరియంట్లలో లభించే ఈ కారు 6-సీట్లు మరియు 7-సీట్ల ఆప్సన్లలో లభిస్తుంది.

మహీంద్రా స్కార్పియో ఎన్ SUV 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్, 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్లను పొందుతుంది. డీజిల్ ఇంజిన్ 175 పీఎస్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. పెట్రోల్ ఇంజిన్ 203 పీఎస్ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇవి రెండూ కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను పొందుతుంది.

ఇదీ చదవండి: మస్క్‌‌ చేసిన పనికి మండిపడ్డ అమెరికా.. గుణపాఠం చెప్పిన దిగ్గజ కంపెనీలు!

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 20.32 సెం.మీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 17.78 సెం.మీ కలర్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ క్రూయిజ్ కంట్రోల్స్, 6-వే పవర్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, ప్రీమియం-లుకింగ్ బ్రౌన్ అండ్ బ్లాక్ లెదర్ సీట్లు మొదలైనవి ఉంటాయి.

మరిన్ని వార్తలు