అందుకే ఫైనల్ మ్యాచ్ చూడను - ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్!

19 Nov, 2023 17:58 IST|Sakshi

యావత్‌ భారతావని ఈ రోజు టీవీలకు అతుక్కుపోయి ఉంటారు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో విశ్వవిజేత ఎవరనేది తెలుసుకోవడానికి సర్వత్రా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌ను దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా చూడనని ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా.. దేశ సేవలో భాగంగానే జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ చూడనని నిర్ణయం తీసుకున్నారు. తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక  జెర్సీ ఫొటో షేర్ చేస్తూ.. ఎవరైనా వచ్చి మనం గెలిచామని చెప్పేవరకు లైవ్ చూడనని ట్వీట్ చేశారు.

నిజానికి ఆనంద్ మహీంద్రా ఓ సెంటిమెంట్ నమ్ముతారు. ఆయన లైవ్ మ్యాచ్ చూస్తే ఇండియా ఓడిపోతుందేమో అని నమ్ముతారు. ఈ కారణంగానే ఆనంద్ మహీంద్రా లైవ్ మ్యాచ్ చూడకూడదని నిర్ణయించుకున్నారు. గతంలో ఈ విషయాన్ని చాలా సార్లు ఆయన స్వయంగా వెల్లడించారు. ఫ్యాన్స్ కూడా కీలకమైన మ్యాచ్‌లు మీరు చూడకండి అంటూ సరదాగా సలహాలు ఇచ్చారు.

ఇదీ చదవండి: వరల్డ్‌కప్‌ ఫైనల్ మ్యాచ్‌‌కు ముందే కొత్త కారు కొన్న ఆస్ట్రేలియా క్రికెటర్ - వీడియో వైరల్

తాజాగా చేసిన ట్వీట్ వైరల్ కావడంతో నెటిజన్లలో ఒకరు స్పందిస్తూ మీరు తీసుకున్న నిర్ణయం జట్టుకు మద్దతుగా నిలవడంతో ఒక భాగమే అంటూ వెల్లడించారు. మరొకరు ఎప్పటికీ మీరు మా హీరోనే.. మీ త్యాగాన్ని చరిత్ర గుర్తుంచుకుందని కామెంట్ చేశారు. ఇంకొకరు ఇవన్నీ అపోహలు.. మీరు హ్యాప్పీగా మ్యాచ్ చూడవచ్చని సలహా ఇచ్చారు.

మరిన్ని వార్తలు