బిల్‌గేట్స్‌ నుంచి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్‌

26 Dec, 2017 11:48 IST|Sakshi

బిల్‌గేట్స్‌ నుంచి భారీగా కానుకలు.. ఊహించడానికే చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా..! అయితే నిజంగా ఆయన నుంచి కానుకలు వస్తే.. ఒక్క దగ్గర ఆగుతామా! ఎగిరి గంతేస్తాం. ప్రస్తుతం 'రెడిట్‌ సీక్రెట్‌ శాంతా' గేమ్‌లో పాల్గొన్న వియెట్టే ఎల్‌ఎల్‌సీ అనే యువతి అదే చేస్తున్నారు. క్రిస్మస్‌ నేపథ్యంలో.. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌ ఆమె ఇంటికి పెద్దఎత్తున కానుకలు పంపించారు. ఈ కానుకలు చూడగానే ఆమె ఆనందం అవధులు దాటింది. వియెట్టే ఎల్‌ఎల్‌సీ, బిల్‌గేట్స్‌ నుంచి అందుకున్న కానుకలతో పాటు ఓ హృదయపూర్వకమైన పోస్టును షేర్‌ చేసింది. ఆ ఆనందం ఎలాంటిదో తన మనసుకే తెలుసని.. ఇకపై క్రిస్మస్‌ను తాను బిల్‌గేట్స్‌కు ముందు, తర్వాత అని జరుపుకొంటానని పేర్కొన్నారు. తాను చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది.

పిల్లులంటే అమితంగా ఇష్టపడే వియెట్టే అభిరుచులకు అనుగుణంగా బిల్‌గేట్స్‌ డజనుకు పైగా కానుకలు పంపించారు. అందులో పెద్ద పుషీన్‌ (కార్టూన్‌ పిల్లి) బొమ్మతో పాటు, జంతు సంరక్షణకు 750 డాలర్ల విరాళం, టీషర్టు, పలు పుస్తకాలు, పిల్లులను పెంచేపెట్టె వంటివి ఉన్నాయి. అలాగే తన ఫోటో, ఓ లేఖను కూడా బిల్‌గేట్స్‌ పంపించారు. అందులో క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద బాక్స్‌ రావడం చూసి తాను చాలా ఆశ్చర్యానికి గురయ్యాయని, బిల్‌గేట్స్‌ నుంచి రావడం తన ఆనందానికి అవధులు లేకుండా చేసిందన్నారు. బిల్‌గేట్స్‌కు తన ఆత్మ కచ్చితంగా తెలిసిందని చెప్పారు. ప్రఖ్యాత రెడిట్‌ వెబ్‌సైట్‌ సీక్రెట్‌ శాంతా పేరుతో.. తన  ఖాతాదారులంతా ఒకరికొకరు కానుకలు ఇచ్చిపుచ్చుకునేలా ఇలాంటి ఆన్‌లైన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో గత కొన్నేళ్లుగా పాల్గొంటున్న బిల్‌గేట్స్‌, ఓ లక్కీ మహిళకు గిఫ్ట్‌లు పంపించారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్థిక బిల్లు ఎఫెక్టా? మార్కెట్ల పతనం

లాభాల జోరు : 39 వేల ఎగువకు సెన్సెక్స్‌

డుమాంట్‌.. ప్రీమియం ఐస్‌క్రీమ్స్‌

ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ లాభం 359 కోట్లు

అకౌంట్లతో పనిలేదు..

అలహాబాద్‌ బ్యాంకులో మరో మోసం

తప్పనిసరై జాతీయం.. తప్పులతో పతనం

ఫేస్‌ స్లిమ్మింగ్‌ ఫీచర్‌తో ఒప్పో ఏ9

మరో కుంభకోణం : షేర్లు ఢమాల్‌

నిజామాబాద్‌లో వాల్‌మార్ట్‌ ప్రారంభం

ఇంటెలిజెంట్‌ వెహికల్స్‌ రయ్‌!

ఎలక్ట్రిక్‌ వాహన బ్యాటరీలు... తెలంగాణకు 3 కంపెనీలు

ఈబిక్స్‌ చేతికి యాత్రా ఆన్‌లైన్‌

భారత్‌కు మాల్యా : బిగ్‌ బ్రేక్‌

భారీగా పతనమైన యస్‌ బ్యాంక్‌ షేరు

నష్టాల్లో సూచీలు : బ్యాంకుల జోరు

హ్యుందాయ్‌ ‘కోనా’ ధర భారీగా తగ్గనుందా?

విప్రో లాభం 2,388 కోట్లు

దిగ్గజ స్టార్టప్‌కు ప్రేమ్‌జీ ఊతం

అజీం ప్రేమ్‌జీ అండతో ఆ స్టార్టప్‌ అరుదైన ఘనత

కార్పొరేట్‌ బ్రదర్స్‌ : అనిల్‌ అంబానీకి భారీ ఊరట

లాభాల్లోకి మార్కెట్లు : బ్యాంక్స్‌ జూమ్‌

రెడ్‌మి కే 20 ప్రొ వచ్చేసింది

రెడ్‌మి కే20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ : బిగ్‌ సర్‌ప్రైజ్‌

స్వల్ప లాభాలతో స్టాక్‌మార్కెట్లు

మార్కెట్లోకి ‘స్కోడా రాపిడ్‌’ లిమిటెడ్‌ ఎడిషన్‌

‘ఐటీఆర్‌ ఫామ్స్‌’లో మార్పుల్లేవ్‌..

ఇక ‘స్మార్ట్‌’ మహీంద్రా!

సు‘జలం’ @ 18.9 లక్షల కోట్లు!

విప్రోకు ఉజ్వల భవిష్యత్‌: ప్రేమ్‌జీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!