క్రెడిట్‌ కార్డ్‌ తిరిగిచ్చేస్తున్నారా?

1 Jul, 2019 11:24 IST|Sakshi

రద్దు పక్కాగా జరగాలి

బకాయిలన్నీ తీర్చిన తర్వాత రద్దుకు దరఖాస్తు

రద్దు చేసుకుంటే క్రెడిట్‌ రేషియో పెరగొచ్చు

ఇది క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం చూపించే అవకాశం

క్రెడిట్‌ కార్డు స్వేచ్ఛగా ఖర్చు చేసేందుకు, రివార్డులు పొందేందుకు, మంచి క్రెడిట్‌ స్కోరు సాధించేందుకు, ఇతరత్రా ఎన్నో ప్రయోజనాలకు ఉపయోగపడే సాధనం. అందుకే వేతన జీవుల్లో ఎక్కువ మంది క్రెడిట్‌ కార్డుపై మక్కువ చూపుతారు. కొందరైతే వివిధ ఆకర్షణీయ ప్రయోజనాలు చూసి ఒకటికి మించి క్రెడిట్‌ కార్డులు తీసేసుకుంటుంటారు. అయితే, ఇలా ఎన్నో క్రెడిట్‌ కార్డుల కారణంగా చెల్లింపులు, వార్షిక రుసుములు, సకాలంలో బాకీల చెల్లింపు వంటి అంశాలను ట్రాక్‌ చేయడం కష్టం కావచ్చు. అందుకే అవసరం లేని వాటిని రద్దు చేసుకోవడం మంచి నిర్ణయమే అవుతుంది. అయితే, ఇలా క్రెడిట్‌ కార్డును రద్దు చేసుకుంటే క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం పడుతుందా..? ఇది ఎవరికి వారి ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్‌ కార్డును రద్దు చేసుకునే విషయంలోనూ లాభ, నష్టాలు కూడా ఉంటాయి. క్రెడిట్‌ కార్డును రద్దు చేసుకుంటే రుణ వినియోగ రేషియో రేటు ప్రభావితం కావచ్చు. కొన్ని సందర్భాల్లో రద్దు మంచికే దారితీయవచ్చు. అందుకే క్రెడిట్‌ కార్డు స్వాధీనం చేసే విషయంలోనూ శ్రద్ధ అవసరం. లేదంటే వ్యక్తిగత క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం చూపించొచ్చు. కనుక క్రెడిట్‌ కార్డు రద్దు చేసుకునే వారు తెలుసుకోవాల్సిన అంశాలను తెలియజేసే కథనమే ఇది.

క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం ఎంత మేర?
క్రెడిట్‌ కార్డును వెనక్కిచ్చిస్తే, తమ క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం చూపిస్తుందా? అన్నది తెలుసుకోవడం ముందుగా చేయాల్సిన పని. రద్దు చేయాలనుకుంటున్న క్రెడిట్‌కార్డు ఒక్కటే మీ దగ్గర ఉండి ఉంటే, మరే ఇతర రుణం కూడా తీసుకుని లేకపోతే, క్రెడిట్‌ బ్యూరో మీ పేరిట క్రెడిట్‌ హిస్టరీ (రుణ చరిత్ర) ప్రారంభించదు. దీంతో క్రెడిట్‌ స్కోరును ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కార్డు రద్దు చేసుకోవడం ద్వారా కోల్పోయినట్టు అవుతుంది. క్రెడిట్‌ కార్డు వినియోగం తర్వాత తిరిగి చెల్లింపులను సకాలంలో చేయడం అన్నది క్రెడిట్‌ స్కోరు నిర్ణయించే ప్రధాన అంశం. సకాలంలో చెల్లింపులు చేశారా, లేదా అన్నది క్రెడిట్‌ హిస్టరీ తెలియజేస్తుంది. సకాలంలో చెల్లింపులతో కూడిన మంచి చరిత్ర ఉంటే, మీ క్రెడిట్‌ కార్డు ఖాతాను కొనసాగించడమే మంచిదన్నది నిపుణుల సూచన. అయితే, క్రెడిట్‌ కార్డును రద్దు చేసుకున్నంత మాత్రాన, అప్పటికే మీ పేరిట ఉన్న క్రెడిట్‌ రిపోర్ట్‌ కానీ, చెల్లింపుల చరిత్ర కానీ కనుమరుగై పోదు. కనుక క్రెడిట్‌ కార్డును రద్దు చేసుకుంటే, ఆలస్యంగా చేసిన చెల్లింపుల చరిత్ర క్రెడిట్‌ బ్యూరోల నుంచి తెరమరుగై పోతుందన్న ఆలోచనతో ఆ పనిచేస్తే ఆశించిన ప్రయోజనం నెరవేరదు.

క్రెడిట్‌ స్కోరులో మరో ముఖ్యమైన అంశం... క్రెడిట్‌ వినియోగ రేషియో. అంటే మీకున్న రుణ వినియోగ పరిమితిలో ఎంత మేర వినియోగించుకున్నారన్నది. మరి క్రెడిట్‌ కార్డును రద్దు చేసుకుంటే, మీకున్న రుణ వినియోగ పరిమితి తగ్గిపోవచ్చు. కానీ, ఖర్చులను తగ్గించుకోకుండా, క్రెడిట్‌ కార్డును రద్దు చేసుకుంటే మరో కార్డుపై వినియోగ రేషియో పెరిగిపోవడానికి దారితీయవచ్చు. సాధారణంగా అందుబాటులో ఉన్న క్రెడిట్‌లో 30 శాతం వినియోగించుకుంటే, తిరిగి చెల్లించగలరని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పరిగణిస్తుంటాయి. ఇక రద్దు చేసుకోదలిచిన క్రెడిట్‌ కార్డు తీసుకుని ఎన్నేళ్లు అయిందన్నదీ చూడాలి. కార్డు తీసుకుని కేవలం ఏడాదే అయినా, కార్డులు తీసుకుని చాలా ఏళ్లు అయినా వాటిని రద్దు చేసుకుంటే క్రెడిట్‌ స్కోరు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రుణ గ్రహీతలతో మంచి సంబంధాల్లో భాగంగా స్థిరమైన ట్రాక్‌ రికార్డును ముఖ్యమైన అంశంగా బ్యాంకులు చూస్తుంటాయి.

ఆటో చెల్లింపులు రద్దు
క్రెడిట్‌ కార్డును రద్దు చేసుకోవాలనుకుంటే, ముందుగా కార్డు సంస్థ వెబ్‌సైట్‌లో లాగి¯Œ  అయి, ప్రతీ నెలా క్రెడిట్‌ కార్డు నుంచి చేయాల్సిన యుటిలిటీ బిల్లుల చెల్లింపుల ఇ¯Œ స్ట్రక్ష¯Œ్సను (ఆటో చెల్లింపులు) రద్దు చేసుకోవాలి. లేదంటే, యుటిలిటీ కంపెనీ కార్డు నుంచి చార్జ్‌ తీసుకునే ప్రయత్నాలను ఎప్పటిమాదిరే చేస్తుంది. కార్డును రద్దు చేసుకోవడం వల్ల చెల్లింపులు విఫలం అవుతాయి. మీరు గుర్తుంచుకుని సకాలంలో ఆ బిల్లులను చెల్లించలేకపోతే ఆలస్యపు రుసుముల భారం భరించాల్సి వస్తుంది.

బకాయిలు చెల్లించిన తర్వాతే
క్రెడిట్‌ కార్డును రద్దు చేసుకునే ముందు ఆ కార్డుకు సంబంధించి బకాయిలను పూర్తిగా తీర్చివేయాలి. ఎందుకంటే బకాయిలు చెల్లించకపోతే ఆ కార్డును రద్దు చేయడానికి సంస్థలు అంగీకరించవు. ఒకవేళ కార్డుపై ఉన్న బకాయిలను చెల్లించలేని వారు, ఆ బ్యాల¯Œ ్సను అప్పటికే ఉన్న మరో క్రెడిట్‌కార్డుకు బదలాయించుకోవచ్చు. అయితే తక్కువ వడ్డీ ప్రయోజనం ఉంటేనే ఇలా చేయాలన్నది సూచన.

రద్దు చేసుకునే ముందు ఆఫర్లు
క్రెడిట్‌ కార్డుపై బ్యాల¯Œ ్స సున్నాగా మారిన తర్వాత క్రెడిట్‌ కార్డును రద్దు చేసుకోవాలనుకుంటున్నట్టు ఆ కార్డును జారీ చేసిన సంస్థకు తెలియజేయాలి. అయితే, ఇలా నిర్ణయం చెప్పిన తర్వాత అదనపు రివార్డులు, వడ్డీ రేటు తగ్గిస్తామంటూ ఆఫర్‌ చేయవచ్చు. అది మంచి ఆఫరే అని భావిస్తే, కార్డుపై అప్పటి వరకు ఉన్న ఆఫర్లు నచ్చక రద్దు నిర్ణయం తీసుకుని ఉంటే, మీ నిర్ణయం మార్చుకోవడం తప్పేమీ కాదు. కానీ, మీరు మీ ఆర్థిక క్రమశిక్షణ, పరిస్థితులకు అనుగుణంగా కార్డును రద్దు చేసుకోవాలని కచ్చితంగా నిర్ణయించుకుంటే మాత్రం కార్డు సంస్థ ఆఫర్ల ఆకర్షణలో పడొద్దు.

ఇక క్రెడిట్‌ కార్డు ఖాతా సంపూర్ణంగా క్లోజ్‌ అయిందని నిర్ధారించుకోకపోతే, వార్షిక ఫీజులను చెల్లించుకోవాల్సి రావచ్చు. క్రెడిట్‌ కార్డును జారీ చేసిన బ్యాంకు లేదా సంస్థకు రద్దు చేసుకునే విషయాన్ని లిఖిత పూర్వకంగా తెలియజేయడం, దాన్ని ఓ రికార్డుగా ఉంచుకోవడం మంచిది. ఇలా రాసే క్లోజింగ్‌ రిక్వెస్ట్‌ లెటర్‌లో పేరు, పూర్తి చిరునామా, క్రెడిట్‌కార్డు నంబర్, జారీ చేసిన తేదీ, సంవత్సరం, రద్దు చేసుకోవాలనుకుంటూ రాస్తున్న తేదీ తదితర వివరాలన్నీ ఉండేలా చూసుకోవాలి. బ్యాంకు నుంచి క్రెడిట్‌ కార్డును క్లోజ్‌ చేసినట్టు ఆధారం కూడా తీసుకోవాలి. కార్డును రద్దు చేసుకున్నట్టు ధ్రువీకరణ అందిన తర్వాత మీవద్దనున్న కార్డును జాగ్రత్తగా నిర్వీర్యం చేయాలి.

కార్డుపై ఉన్న ప్రయోజనాలు
క్రెడిట్‌ కార్డులు కేవలం రుణమే కాకుండా ఎన్నో ఇతర ప్రయోజనాలతో ఉంటాయి. పర్యటనలు, షాపింగ్‌ బిల్లుల చెల్లింపులకు క్రెడిట్‌ కార్డులను వినియోగించడం ద్వారా రివార్డులను పొందొచ్చు. అయితే, కార్డును రద్దు చేసుకుంటే వాటిపై ఉన్న రివార్డులూ కోల్పోతారు. కనుక క్రెడిట్‌ రివార్డులను అప్పటికే చెల్లించాల్సిన బకాయిలతో సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం ఉందా అని తెలుసుకోవాలి. ఒకవేళ అప్పటికే బ్యాల¯Œ ్సను కూడా చెల్లించేసి ఉంటే, ఆ రివార్డులను షాపింగ్‌ లేక రెస్టారెంట్‌లో రెడీమ్‌ చేసుకున్న తర్వాతే రద్దు చేసుకోవాలి.

క్రెడిట్‌ రిపోర్ట్‌ పరిశీలన
క్రెడిట్‌కార్డు రద్దు నిర్ణయం మీ క్రెడిట్‌ రిపోర్ట్‌లోకి చేరేందుకు కనీసం 4–6 వారాల సమయం తీసుకోవచ్చు. అందుకుని అంత కాలం పాటు ఆగి ఆ తర్వాత, ఆర్‌బీఐ అనుమతి కలిగిన ఏ క్రెడిట్‌ బ్యూరో నుంచి అయినా రిపోర్ట్‌ తీసుకుని పరిశీలించుకోవడం చేయాలి. ఒకవేళ క్రెడిట్‌ కార్డు ఖాతా క్లోజ్‌ అయినట్టు క్రెడిట్‌ రిపోర్ట్‌ చూపించకపోతే, వెంటనే సంబంధిత కార్డు సంస్థ వద్ద ఫిర్యాదు దాఖలు చేయడం అవసరం. క్రెడిట్‌ కార్డు రద్దు చేసుకోవడం చిన్న పనే. కానీ, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం క్రెడిట్‌ స్కోరును దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు