సింగ్‌ బ్రదర్స్‌కు షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు

31 Jan, 2018 19:46 IST|Sakshi

సాక్షి,  న్యూఢిల్లీ:  ఔషధ సంస్థ దైచీ శాంక్యో ,  సింగ్‌ బ్రదర్స్‌ వివాదంలో సింగ్‌ బ్రదర్స్‌కు భారీ షాక్‌ తగిలింది. ఈ కేసులో 3500 కోట్ల  రూపాయల దావాను దైచీ  శాంక్యో గెలిచింది.  ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు సింగపూర్‌ ఆర్బిట్రేషన్‌ తీర్పును సమర్ధిస్తూ  బుధవారం తీర్పు వెలువరించింది. జపనీస్‌ దిగ్గజం  దైచీ శాంక్యో  దాఖలు చేసిన ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ కేసులో రాన్‌బాక్సీ  మాజీ అధిపతులు సింగ్‌ బ్రదర్స్‌నుంచి ఈ మొత్తాన్ని  వసూలు చేసుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది.  

 ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌  తీర్పును అమలు చేయాలంటూ  మే,  2016 లో  ఢిల్లీ హైకోర్టును దైచీ ఆశ్రయించింది. అయితే, ఈ అవార్డును అమలు చేయడానికి భారత మధ్యవర్తిత్వ చట్టం ప్రకారం సబ్‌స్టాంటివ్‌  అభ్యంతరాలున్నాయంటూ  సింగ్‌ బ్రదర్స్‌ దీన్ని సవాల్‌  చేశారు. దీనిపై కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.

కాగా ఔషధ సంస్థ దైచీ శాంక్యో నుంచి వాస్తవాలు దాచి, తప్పుడు నివేదికలు అందించిన కేసులో అప్పటి ర్యాన్‌బ్యాక్సీ ప్రమోటర్లు  మల్వీందర్‌ సింగ్‌, శివీందర్‌ సింగ్‌ భారీ నష్టపరిహార కేసును ఎదుర్కొంటున్నారు.  ఈ వ్యవహారంలో దైచీ శాంక్యో 2013లో   సింగపూర్ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించగా  రూ .2,562 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని  2016లో కోర్టు ఆదేశించింది.  వడ్డీతో సహా మొత్తం ఇది రూ .3,500 కోట్లకు చేరిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు