జడ్చర్లలో డీఎస్‌ఎం న్యూట్రిషన్‌ ప్లాంటు

16 Oct, 2018 01:06 IST|Sakshi

భారత మార్కెట్‌ వేగంగా పెరుగుతోంది

డీఎస్‌ఎం ప్రెసిడెంట్‌ డేవిడ్‌ బ్లాక్‌మోర్‌

జడ్చర్ల: జంతువుల పోషకాహార విభాగంలో ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న డీఎస్‌ఎం సంస్థ... మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్జర్ల మండలంలోని పోలేపల్లి గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో తన ప్లాంటును ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలోని అంబార్‌లో తొలి ప్లాంటును ఏర్పాటు చేసిన ఈ సంస్థ... తన రెండో ప్లాంటును జడ్చర్లలో సోమవారం ఆరంభించింది. ఈ సందర్భంగా డీఎస్‌ఎం న్యూట్రీషియనల్‌ ప్రొడక్ట్స్‌ ప్రెసిడెంట్‌ డేవిడ్‌ బ్లాకెమోర్‌ మాట్లాడుతూ... యానిమల్‌ న్యూట్రిషన్‌కు సంబంధించి భారతీయుల్లో అవగాహన పెరుగుతోందని, దీంతో భారత మార్కెట్లో ఎదిగేందుకు విస్తృత అవకాశాలున్నాయని చెప్పారు.

జంతువులకూ పోషక పదార్థాలు అవసరమన్నారు. తమ రెండు ప్లాంట్ల ద్వారా ఉత్తర, దక్షిణ భారతాల్లో విస్తరిస్తామని, తరువాత పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్‌కు సైతం తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తామని చెప్పారాయన. దాదాపు 174 దేశాలలో కార్యకలాపాలున్న డీఎస్‌ఎం టర్నోవరు రూ.2 వేల కోట్ల వరకూ ఉంది. ఈ కార్యక్రమంలో బిజినెస్‌ యూనిట్‌ డైరెక్టర్‌ రవీంద్ర, డీఎస్‌ఎం ఇండియా ప్రెసిడెంట్‌ రాజగోపాల్, స్థానిక సైట్‌ మేనేజర్‌ ఉమాశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు