రేపు జీజీకే టెక్‌ నూతన కేంద్రం ప్రారంభం

11 May, 2017 03:26 IST|Sakshi

ఏడాదిలో 1,000 మంది ఉద్యోగులు నియామకం  
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌ కేంద్రంగా బిజినెస్‌ టెక్నాలజీ సేవలందిస్తున్న జీజీకే టెక్‌ విస్తరణ బాట పట్టింది. శుక్రవారం నాడు ఉప్పల్‌లోని ఎన్‌ఎస్‌ఎల్‌ ఎరీనా సెజ్‌లో నూతన కేంద్రాన్ని ప్రారంభించనుంది. 63 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ కేంద్రం ప్రారంభ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ ముఖ్యఅతిథులుగా హాజరవుతారని జీజీకే టెక్‌ ఫౌండర్‌ అండ్‌ సీటీఓ శ్యామ్‌ పాల్‌రెడ్డి చెప్పారు.

 బుధవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ... నూతన కార్యాలయంలో ఏడాదిలో 1,000 మంది, 2020 నాటికి 4,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామని చెప్పారు. ఐఐటీ, ఎన్‌ఐటీ, బిట్స్, ఐఐఎం వంటి క్యాంపస్‌ల నుంచి నిపుణులైన అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. 2004లో సేవలను ప్రారంభించిన జీజీకే టెక్‌ గచ్చిబౌలి, జూబ్లిహిల్స్‌లోనూ కార్యాలయాలున్నాయి. అమెరికా, యూకే, యూరప్‌ల్లోని తమ కస్టమర్లకు కస్టమ్‌ అప్లికేషన్‌ అభివృద్ధి, అడ్వాన్స్‌డ్‌ అనలటిక్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, రోబోటిక్‌ ప్రాసెస్, క్లౌడ్‌ డెవలప్‌మెంట్‌ అప్లికేషన్స్‌ వంటి సేవలను అందిస్తోంది.

మరిన్ని వార్తలు