Microsoft: మైక్రోసాఫ్ట్ జీడీసీ లీడర్‌గా అపర్ణ గుప్తా

21 Nov, 2023 20:27 IST|Sakshi

Microsoft GDC Leader: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా తన కొత్త గ్లోబల్ డెలివరీ సెంటర్ (జీడీసీ) లీడర్‌ని అధికారికంగా ప్రకటించింది. ఈమె ఎవరు? ప్రస్తుతం ఆమె చేపట్టే బాధ్యతలు ఏవి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మైక్రోసాఫ్ట్ కొత్త గ్లోబల్ డెలివరీ సెంటర్ (జిడిసి) లీడర్‌గా 'అపర్ణ గుప్తా' (Aparna Gupta) బాధ్యతలు స్వీకరించింది. ఈమె క‌స్ట‌మ‌ర్ ఇన్నోవేష‌న్‌, డెలివ‌రీ సామ‌ర్ధ్యాల‌ను పర్యవేక్షిస్తుంది. 2005లో మైక్రోసాఫ్ట్ ఇండ‌స్ట్రీ సొల్యూష‌న్స్ డెలివరీ విభాగంగా జీడీసీని హైద‌రాబాద్‌లో నెల‌కొల్పారు. ఆ తరువాత ఇది బెంగళూరు, నోయిడా వంటి ప్రాంతాలకు విస్తరించింది.

అపర్ణ గుప్తా లీడర్షిప్ లక్షణాలు మాత్రమే కాకుండా మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ మీద కూడా మంచి పట్టుని కలిగి ఉంది, ఆమె సారథ్యంలో కంపెనీ పురోగతి చెందుతుందన్న విశ్వాసం తమకుందని మైక్రోసాఫ్ట్ ఇండస్ట్రీ సొల్యూషన్స్ డెలివరీ కార్పోరేట్ వైస్ ప్రెసిడెంట్ మౌరీన్ కాస్టెల్లో అన్నారు.

ఆరు సంవత్సరాల క్రితం, అపర్ణ కమర్షియల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ (CSE)గా చేరి.. ఇప్పుడు గ్లోబల్ డెలివరీ సెంటర్ (జిడిసి) లీడర్‌గా ఎంపికైంది. ప్రారంభం నుంచి మంచి ప్రతిభను కనపరిచిన అపర్ణ ఇప్పుడు ఉన్నత స్థాయికి చేరింది, రానున్న రోజుల్లో మరింత గొప్ప స్థాయికి చేరే అవకాశం ఉందని భావిస్తున్నాము.

మరిన్ని వార్తలు