జీఎస్‌టీ రేట్‌ కట్‌: చౌకగా 177 వస్తువులు

10 Nov, 2017 14:49 IST|Sakshi

సాక్షి, గౌహతి: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ  అధ్యక్షతన వివిధ రాష్ట్రాల, కేంద్ర  పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో  అసోంలో జరిగిన జీఎస్‌టీ 23వ కౌన్సిల్‌ సమావేశంలో జీఎస్‌టీ రేట్ల స్లాబ్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. గౌహతిలో  శుక్రవారం జరిగిన మండలి సమావేశంలో నిత్యావసరమైన పలు వస్తువులపై జీఎస్‌టీని తగ్గించింది. ఇప్పటి వరకు 227 వస్తువులపై 28శాతం పన్ను రేటు వుండగా ప్రస్తుతం కేవలం 50 వస్తువులపై మాత్రమే 28శాతం పన్ను నిర్ణయించినట్టు బిహార్‌ ఆర్థికమంత్రి సుశీల్‌ మోడీ ప్రకటించారు. పొగాకు, లగ్జరీ వస్తువలపై మాత్రమే అధిక రేట్లను నిర్ణయించామని చెప్పారు.

చూయింగ్‌ గమ్స్‌, చాకోలెట్స్‌, ఆఫ్టర్‌ షేవ్‌, వాషింగ్‌ పౌడర్‌ తదితర వస్తువులపై జీఎస్‌టీని 18 శాతంగా నిర్ణయించింది. టెక్నాలజీ సంబంధిత అంశంపై వడ్డీరేటును నిర్ణయించేందుకు ఐదుగురు సభ్యుల మంత్రుల బృందానికి నేతృత్వం వహిస్తున్న మోడీ అత్యధిక పన్నుల స్లాబ్‌ 28శాతం కేటగిరీ లో 177 వస్తువుల ధరలను తగ్గించేందుకు కౌన్సిల్ అంగీకరించినట్టు తెలిపారు. నాన్‌ ఎసీ రెస్టారెంట్లపై 18శాతం నుంచి జీఎస్‌టీ పన్నులను 12శాతానికి  తగ్గించింది.

వ్యాపారులు, తయారీదారులు & వినియోగదారులకు అనుకూలంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకోనున్నామని అసోం ఆర్థిక మంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. ఇప్పటికే దాదాపు 200 వస్తువులపై పన్ను రేటును 28 శాతం నుంచి 18శాతానికి తగ్గించే నిర్ణయం తీసుకున్నామన్నారు.

మరిన్ని వార్తలు