ఊహించని పరిణామం, ఓపెన్‌ఏఐ సీఈఓగా శామ్‌ ఆల్ట్‌మన్‌ బాధ్యతలు

22 Nov, 2023 11:59 IST|Sakshi

ప్రముఖ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఓపెన్‌ ఏఐ ఆసక్తికర ప్రకటన చేసింది. కంపెనీ సీఈఓగా తిరిగి శామ్‌ ఆల్ట్‌మన్‌ బాధ్యతలు చేపట్టినట్లు తెలిపింది. ముందే ఊహించినట్లుగానే ఓపెన్‌ఏఐ బోర్డు కొత్త సభ్యులు బ్రెట్ టేలర్, లారీ సమ్మర్స్, ఆడమ్ డి ఏంజెలో’లను నియమించింది. 

తాజాగా, పరిణామాలపై శామ్‌ ఆల్ట్‌మన్‌ స్పందించారు. ‘ఐ లవ్‌ ఓపెన్‌ఏఐ. నేను ఓపెన్‌ఏఐలోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే, మైక్రోసాఫ్ట్‌తో మరింత బలమైన భాగస్వామ్యంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. 

ఓపెన్‌ఏఐలో మైక్రోసాఫ్ట్‌ భారీ పెట్టుబడులు
శామ్ ఆల్ట్‌మన్ ఓపెన్‌ఏఐ సీఈఓగా తిరిగి రావాలని తన నిర్ణయాన్ని ప్రకటించిన కొద్ది నిమిషాల తర్వాత మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్యనాదెళ్ల ధృవీకరించారు. ఓపెన్‌ఏఐలో మైక్రోసాఫ్ట్‌ రూ.1300 కోట్లు పెట్టుబడులు పెట్టింది.అయితే ఓపెన్‌ ఏఐ ఆల్ట్‌మన్‌ను తొలగించడంతో.. ఆయనను మైక్రోసాఫ్ట్‌ ఏఐ విభాగంలోకి తీసుకునేందుకు సత్యనాదెళ్ల ప్రయత్నించారు. గత వారం రోజులుగా జరుగుతున్న వరుస పరిణామాలతో ఆల్ట్‌మన్‌ తిరిగి ఓపెన్‌ఏఐ సీఈఓ బాధ్యతలు చేపడుతున్నారంటూ మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్యనాదెళ్ల బుధవారం ఎక్స్‌ పోస్ట్‌లో తెలిపారు.   

చాట్‌జీపీటీతో వెలుగులోకి 
గత ఏడాది కృత్తిమ మేధ (ఏఐ) చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ విడుదలతో ఓపెన్‌ ఏఐ సీఈఓగా శామ్‌ ఆల్ట్‌మన్‌ వెలుగులోకి వచ్చారు. అంతేకాదు, ఏఐ రీసెర్చ్‌, డెవలప్‌మెంట్‌పై బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టేలా దోహద పడ్డారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ రేసులో ముందంజలో ఉండటమే కాదు.. గత ఏడాది చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ విడుదలతో ఓపెన్‌ ఏఐ సీఈఓగా శామ్‌ ఆల్ట్‌మన్‌ వెలుగులోకి వచ్చారు.

మరిన్ని వార్తలు