గార్డెనింగ్ తో గృహశోభ!

15 Apr, 2016 23:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఈరోజుల్లో ఇంట్లో పెంపుడు జంతువులు, ఇంటి బయట గార్డెనింగ్ ఈ రెండూ హాబీలుగా మారిపోయాయి. అయితే ఇందులో గార్డెనింగ్ అనేది ఏవో మొక్కలు పెంచేసి.. రోజూ నీళ్లు పోస్తే సరిపోలే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇంటి ఆవరణలో గార్డెనింగ్ ఎంత ఆహ్లాదంగా ఉంటే ఆ ఇంటి అందం రెట్టింపవుతుంది మరి. గార్డెనింగ్‌లో నిపుణుల పలు సూచనలివిగో..

మొక ్కలు ఎంపిక చేసుకొనే ముందు అవి పెరిగే ఎత్తు, పూల రంగు, వాసన వంటి అంశాలను గమనించాలి. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతాయో తెలుసుకోవాలి కూడా.

గార్డెనింగ్ అంటే నిటారుగా పెరిగే మొక్కలు కాకుండా పొదల మాదిరిగా పెరిగే పూల మొక్కలు, తీగలతో అల్లుకుపోయే మొక్కలు పెంచుకుంటే ఇంటి ఆవరణ అందంగా ఉంటుంది.

ఏ మొక్కకు ఎంత నీరు పెట్టాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. మొక్కలు నాటిన మొదటివారంలో రోజూ నీరు పెట్టాలి. రెండో వారం నుంచి రెండు రోజులకొకసారి నీరు పెట్టొచ్చు. అయితే ఇది అన్ని మొక్కలకు వర్తించదు. కొన్ని రకాల పూల మొక్కలకు ప్రతి రోజూ నీరు పెట్టాల్సి ఉంటుంది మరి.

మరిన్ని వార్తలు