బిట్‌కాయిన్స్‌పై ఐసీఏఐ అధ్యయనం

27 Jan, 2018 01:21 IST|Sakshi

కోల్‌కతా: బిట్‌కాయిన్స్‌ వంటి క్రిప్టోకరెన్సీలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) వీటిపై అధ్యయనం చేయనుంది. క్రిప్టో కరెన్సీలపై అభిప్రాయం చెప్పాలని కేంద్రం సూచించడంతో ఈ సమగ్ర అధ్యయనం చేపడుతున్నట్లు ఐసీఏఐ సభ్యుడు (డిజిటల్‌ అకౌంటింగ్‌ అండ్‌ అష్యూరెన్స్‌ స్టాండర్డ్‌ బోర్డ్‌) దెబాశిష్‌ మిత్రా తెలిపారు.

‘‘ఈ ఏడాది మార్చికల్లా కంపెనీ వ్యవహారాల శాఖకు దీనిపై నివేదిక సమర్పించే అవకాశముంది. దీనికోసం ఆయా అంశాలపై పట్టు ఉన్న సంస్థల అభిప్రాయాలు కూడా తీసుకుంటాం’’ అని మిత్రా వివరించారు. కార్పొరేట్‌ గవర్నెన్స్, కంపెనీల చట్టంపై సీఐఐ నిర్వహించిన సెమినార్‌లో పాల్గొన్న సందర్భంగా మిత్రా ఈ విషయాలు చెప్పారు. 

మరిన్ని వార్తలు