ఆ రోజు సౌండ్‌ పార్టీ 

15 Nov, 2023 00:22 IST|Sakshi
‘సౌండ్‌ పార్టీ’ పోస్టర్‌

వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్‌ జంటగా నటించిన చిత్రం ‘సౌండ్‌ పార్టీ’. శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్‌ పృధ్వీ, ‘మిర్చి’ ప్రియ కీలక పాత్రల్లో నటించారు. సంజయ్‌ శేరి దర్శకత్వంలో జయశంకర్‌ సమర్పణలో రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్‌ గజేంద్ర నిర్మించారు.

ఈ సినిమాను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ మంగళవారం ప్రకటించింది. ‘‘ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు .దర్శక– నిర్మాతలు. ఈ సినిమాకు సంగీతం: మోహిత్‌ రెహమానిక్‌.

మరిన్ని వార్తలు