ట్యాబ్స్‌ విక్రయాలు 16 శాతం డౌన్‌

13 Jun, 2017 00:33 IST|Sakshi
ట్యాబ్స్‌ విక్రయాలు 16 శాతం డౌన్‌

న్యూఢిల్లీ: ట్యాబ్లెట్స్‌ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన జనవరి–మార్చి త్రైమాసికంలో 16 శాతం క్షీణతతో 7.6 లక్షల యూనిట్లకు తగ్గాయి. హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీలు ట్యాబ్లెట్స్‌కి ప్రచారం కల్పించకపోవడమే దీనికి కారణమని రీసెర్చ్‌ సంస్థ సీఎంఆర్‌ తెలిపింది. ఇక అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే జనవరి–మార్చి త్రైమాసికంలో ట్యాబ్లెట్స్‌ అమ్మకాలు 6 శాతంమేర క్షీణించాయని పేర్కొంది.

ఇక డేటావిండ్‌ 34 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో ఉందని తెలిపింది. దీని తర్వాతి స్థానాల్లో ఐబాల్‌ (16 శాతం), శాంసంగ్‌ (15 శాతం), మైక్రోమ్యాక్స్‌ (8 శాతం) ఉన్నాయని పేర్కొంది. ప్రభుత్వ రంగాల నుంచి ట్యాబ్లెట్స్‌కు డిమాండ్‌ ఉంటోందని సంస్థ తెలిపింది.

మరిన్ని వార్తలు