సెప్టెంబర్‌లో కార్యాలయ ఉద్యోగ నియామకాలు తగ్గుదల | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌లో కార్యాలయ ఉద్యోగ నియామకాలు తగ్గుదల

Published Tue, Oct 10 2023 6:34 AM

White-collar hiring sees 8. 6 percent decline in September - Sakshi

ముంబై: ఐటీ, బీపీవో, ఎఫ్‌ఎంసీజీ తదితర రంగాల్లో ప్రతికూల ధోరణులతో.. కార్యాలయ ఉద్యోగుల (వైట్‌ కాలర్‌) నియామకాలు సెప్టెంబర్‌లో 8.6 శాతం తగ్గాయి. ఆగస్ట్‌ నెలతో పోలిస్తే సెప్టెంబర్‌లో నియామకాలు 6 శాతం పెరిగినట్టు నౌకరీ జాబ్‌ స్పీక్‌ ఇండెక్స్‌ సర్వే నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్‌లో మొత్తం 2,835 మంది కోసం నియామక ప్రకటనలు వెలువడ్డాయి. అంతక్రితం నెలలో 3,103 ఉద్యోగాలకు ప్రకటనలు విడుదలైనట్టు ఈ నివేదిక తెలిపింది.

ప్రతి నెలా తన పోర్టల్‌పై వెలువడే పోస్టింగ్‌ల ఆధారంగా నౌకరీ డాట్‌ కామ్‌ ఈ నివేదికను విడుదల చేస్తుంటుంది. అంతర్జాతీయంగా అనిశి్చత పరిస్థితుల నేపథ్యంలో ఐటీ రంగంలో నియామకాలు గత కొన్ని నెలలుగా తగ్గుతూ వస్తున్న విషయాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. బీపీవో/ఐటీఈఎస్‌ రంగంలో 25 శాతం, ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమలో 23 శాతం చొప్పున నియామకాలు క్షీణించాయి. ‘‘ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం కొనసాగుతూనే ఉంది. బ్యాంకింగ్‌ రంగలో బలమైన వృద్ధి ఉండడం ఆశావహం.

మొత్తం మీద సీక్వెన్షియల్‌గా 6 శాతం వృద్ధిని చూడడం అన్నది భారత ఉద్యోగ మార్కెట్‌ బలంగా ఉందన్న దాన్ని సూచిస్తోంది’’అని నౌకరీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ పవన్‌ గోయల్‌ తెలిపారు. ఆతిథ్యరంగం , రవాణా నియామకాల పరంగా మెరుగైన వృద్ధిని చూశాయి. ఈ రంగాలకు సంబంధించి ముంబైలో ఎక్కువ జాబ్‌ ఆఫర్లు ఉన్నట్టు నౌకరీ తెలిపింది. సెప్టెంబర్‌ క్వార్టర్‌లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సరీ్వసెస్, ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ), హెల్త్‌కేర్‌ రంగాల్లో 7 శాతం నియాకాల వృద్ధి నమోదైంది. బ్రాంచ్‌ మేనేజర్, ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్‌ నిపుణులకు డిమాండ్‌ నెలకొంది. ఆయిల్‌ అండ్‌ గ్యాస్, ఆటో రంగాల్లో 6 శాతం వృద్ధి కనిపించింది. కొత్త ఉద్యోగ నియామకాల్లో మెట్రోలతో పోలిస్తే, ఇతర పట్టణాల్లో వృద్ధి నెలకొంది.

Advertisement
Advertisement