ఐటీ ఇండస్ట్రీకి నాస్కామ్ గుడ్ న్యూస్

22 Jun, 2017 13:41 IST|Sakshi
ఐటీ ఇండస్ట్రీకి నాస్కామ్ గుడ్ న్యూస్
దేశీయ ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ గుడ్ న్యూస్ అందించింది. ఫిబ్రవరిలో గైడెన్సు  ప్రకటించడాన్ని వాయిదావేసిన నాస్కామ్, నేడు 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెవెన్యూ గైడెన్స్ లను ప్రకటించింది. 2018 ఆర్థిక సంవత్సరంలో ఐటీ గ్రోత్ గైడెన్స్ ఆశాజనకంగా ఉంటుందని తెలిపింది.  దేశీయంగా ఐటీ సర్వీసులు రెవెన్యూ వృద్ధి 10-11 శాతం ఉంటుందని నాస్కామ్ అంచనావేసింది. అదేవిధంగా ఎగుమతుల రెవెన్యూలు గ్రోత్ 7-8శాతం పెరుగుతుందని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇండస్ట్రీ 1.3 లక్షల నుంచి 1.5 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పిస్తుందని నాస్కామ్ సభ్యులు చెప్పారు. ఇది ఐటీ ఇండస్ట్రీకి సానుకూలంగా నిలిచింది. దీంతో ఐటీ కంపెనీ షేర్లు కూడా జోరుగా లాభాలు పండిస్తున్నాయి.
 
2.35 శాతం పైకి  ఎగిసిన ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లు ప్రస్తుతం 1.35 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి. విప్రో, టీసీఎస్,హెచ్సీఎల్ లు కూడా లాభాలు పండిస్తున్నాయి.  2017లో ఇండస్ట్రీ ఆదాయం 11 బిలియన్ డాలర్లకుపైగా పెరిగినట్టు కూడా పేర్కొంది. 2018 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఇండస్ట్రీ రీస్కిలింగ్, అకాడమిక్ భాగస్వామ్యంపై ఫోకస్ చేయడం కొనసాగిస్తుందని నాస్కామ్ చెప్పింది.  ఎస్ఏఏఎస్ అప్లికేషన్స్, క్లౌడ్ ప్లాట్ ఫామ్స్, బీఐలు గ్లోబల్ గ్రోత్ ఏరియాలుగా నాస్కామ్ తెలిపింది. నాస్కామ్ నేడు ప్రకటించిన గైడెన్స్ ఫలితాలు అనిశ్చిత పరిస్థితుల్లో కొనసాగుతున్న ఐటీ ఇండస్ట్రీకి గుడ్ న్యూస్ గా మారాయి. కాగ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మరో నాలుగు రోజుల్లో మోదీ భేటీ కాబోతున్నారు. 
మరిన్ని వార్తలు