మారుతి వాహనాల ధరల పెంపు..ఎందుకంటే 

2 Apr, 2019 15:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:   దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎస్ఎంఐ) తనవాహనాల ధరలను పెంచుతున్నట్టు   ప్రకటించింది.  హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల రిజిస్ట్రేషన్‌  ప్రక్రియ  ఏప్రిల్ 1, సోమవారం నుంచి తప్పనిసరి నిబంధన అమల్లోకి వచ్చిన  నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడిండించింది.  అన్నిమోడళ్ల వాహనాలపై  రూ. 689  (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)  వరకు పెంపు ఉంటుందని తెలిపింది. కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.

హై సెక్యూరిటీ ప్లేట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ  ప్రభుత్వం మాండేటరీ చేసిన నేపథ్యంలో ఏప్రిల్‌ 1 నుంచి  ఈ పెంపుఅమల్లోకి తీసుకొచ్చినట్టు మారుతి  రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

కాగా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరంటూ గతంలో ప్రభుత్వం ఆదేశించినా కూడా..వాహనదారుల నుంచి  ఆసక్తి కరువవ్వడంతో  దీనిపై రవాణాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై షోరూమ్ నుంచి బయటకొచ్చే ప్రతి వాహనానికి షోరూముల్లోనే తప్పనిసరిగా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు  బిగించాలని రవాణా శాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. వాహనాలకు సంబంధించిన టెక్నికల్ వివరాలతోపాటు వాహన యజమానుల వివరాలు పొందుపరిచేలా బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటచేసుకోవాలని ఇదివరకే షోరూమ్ నిర్వాహకులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల విషయంలోనూ పాటించాలని నిబంధనలు విధించారు. 

మరిన్ని వార్తలు