సాక్షి మనీ మంత్ర : నష్టాల్లో దేశీయ స్టాక్‌ సూచీలు

16 Nov, 2023 09:40 IST|Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బలిప్రతిపద సెలవు తర్వాత నిన్న సూచీలు జోరును కొనసాగించాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 814 పాయింట్లు ఎగసి 65,748 వద్ద, నిఫ్టీ 249 పాయింట్లు బలపడి 19,693 వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. అయితే, గురువారం మాత్రం స్టాక్‌ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. 

ఉదయం 9.30గంటలకు సెన్సెక్స్‌ 114 పాయింట్ల నష్టంతో 65568 వద్ద నిఫ్టీ 36 పాయింట్ల స్వల్ప నష్టంతో ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. ఎన్‌టీపీసీ, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, హీరోమోటోకార్ప్‌, కోల్‌ఇండియా, టీసీఎస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, సన్‌ ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బజాజ్‌ ఫైనాన్స్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మరిన్ని వార్తలు