విద్యార్థుల కోసం మైక్రోసాఫ్ట్ మరో ట్యాబ్లెట్

23 Apr, 2014 02:25 IST|Sakshi
విద్యార్థుల కోసం మైక్రోసాఫ్ట్ మరో ట్యాబ్లెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల కోసం ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఓమ్ని 10 ట్యాబ్లెట్‌ను రూపొందించింది. ఇందుకోసం హెచ్‌పీ, పియర్సన్ కంపెనీలతో చేతులు కలిపింది. ధర రూ.29,999 ఉంది. నెలకు రూ.2,990 చొప్పున 12 నెలల వాయిదాల్లో కొనుగోలు చేయవచ్చు. టెక్నికల్, మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ల కోసం ఉద్దేశించిన ఈ ఆఫర్ జూన్ 15 వరకు ఉంటుంది. విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ట్యాబ్లెట్ పనిచేస్తుంది. 10.1 అంగుళాల స్క్రీన్, ఇంటెల్ ఆటమ్ జెడ్3000 ప్రాసెసర్, 8 ఎంపీ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, గొరిల్లా గ్లాస్ 3, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 8.5 గంటల బ్యాటరీ బ్యాకప్ దీని ప్రత్యేకతలు. మార్కె ట్లో ఈ ట్యాబ్లెట్ సంచలనం సృష్టిస్తుందని మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ (పబ్లిక్ సెక్టార్, ఎడ్యుకేషన్) అరుణ్ రాజమణి ఈ సందర్భంగా తెలిపారు. విద్యార్థులకు అవసరమయ్యే ప్రీలోడెడ్ కంటెంట్, అప్లికేషన్లను ఇందులో పొందుపరిచినట్టు చెప్పారు. 6-12వ తరగతి విద్యార్థుల కోసం మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏసర్ ఐకానియా డబ్ల్యూ4-820 అనే మోడల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని ధర రూ.24,999.
 
మరిన్ని వార్తలు