ఈ ఏడాదే భారత్‌కు మాంటెరో

10 Jul, 2015 01:14 IST|Sakshi
ఈ ఏడాదే భారత్‌కు మాంటెరో

వచ్చే ఏడాది ఔట్‌ల్యాండర్

హిందుస్తాన్ మోటార్స్ సీఈవో విజయన్‌ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  భారత్‌కు చిన్న కార్లను తీసుకొచ్చే ఆలోచనేదీ లేదని హిందుస్తాన్ మోటార్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఈవో పి.విజయన్ తెలిపారు.  స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలపైనే (ఎస్‌యూవీ) ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నామని పేర్కొ న్నారు. ఇక్కడి బంజారాహిల్స్‌లో మిత్సుబిషి షోరూంను ప్రారంభించిన సందర్భంగా ప్రైడ్ మిత్సుబిషి ఎండీ ఎం.సురేష్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏటా 28-30 వేల వాహనాలు అమ్ముడవుతున్న స్పోర్ట్స్ యుటిలిటీ-4 విభాగంలో మిత్సుబిషి పజెరో స్పోర్ట్స్ ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకుందని,  ఏటా దేశీయంగా  3 వేల యూనిట్లు విక్రయిస్తున్నట్టు తెలిపారు. హిందుస్తాన్ మోటార్స్, మిత్సుబిషి మధ్య సాంకేతిక, మార్కెటింగ్ ఒప్పందం ఉంది.

 మరో రెండు మోడళ్లు..: హిందుస్తాన్ మోటార్స్ మిత్సుబిషికి చెందిన మాంటెరో, ఔట్‌ల్యాండర్ మోడళ్లను భారత్‌లో తిరిగి ప్రవేశపెడుతోంది. మాంటెరో ఈ ఏడాదే మార్కెట్లోకి రానుంది. దీని ధర రూ.60 లక్షల వరకు ఉండొచ్చని విజయన్ తెలిపారు.  ఇక వచ్చే ఏడాది జూన్‌కల్లా ఔట్‌ల్యాండర్‌ను డీజిల్, పెట్రోల్ వర్షన్లలో ప్రవేశపెడతాం. దీని ధర రూ.25 లక్షలుండొచ్చని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు