లింగి లింగిడి..! 

11 Nov, 2023 03:10 IST|Sakshi
రాహుల్, శివానీ, మిధున్, తేజా మార్ని, ‘బన్నీ’ వాసు, విద్య

శ్రీకాంత్‌ మేక, రాహుల్‌ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల అవుతోంది.

రంజిన్‌ రాజ్, మిధున్‌ ముకుందన్‌ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘లింగి లింగిడి..’ అంటూ సాగే పాటను ఇటీవల విడుదల చేయగా, 30 మిలియన్‌ వ్యూస్‌ను పూర్తి చేసుకుంది. ‘‘ఈ పాటలానే మా చిత్రానికి ప్రేక్షకులు విజయం అందిస్తారనే నమ్మకం ఉంది’’ అని హైదరాబాద్‌లో నిర్వహించిన సెలబ్రేషన్స్‌లో ‘బన్నీ’ వాసు అన్నారు.

మరిన్ని వార్తలు