ఎన్‌ఎంసీఈ, ఐసీఈఎక్స్‌ల విలీనం

4 Jul, 2017 00:34 IST|Sakshi
ఎన్‌ఎంసీఈ, ఐసీఈఎక్స్‌ల విలీనం

న్యూఢిల్లీ: దేశంలో తొలి కమోడిటీ ఎక్సే్ఛంజ్‌ల విలీనానికి శ్రీకారం చుడుతూ నేషనల్‌ మల్టీ కమోడిటీ ఎక్ఛేంజ్‌ (ఎన్‌ఎంసీఈ), ఇండియన్‌ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌ (ఐసీఈఎక్స్‌)తో విలీనం కానుంది. విలీనం పూర్తయితే...ఇది దేశంలో మూడో పెద్ద కమోడిటీ ఎక్సే్ఛంజ్‌గా అవతరిస్తుంది.  ఇది డైమండ్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టులతో పాటు బులియన్, ఆయిల్, రబ్బరు, ఇతర వ్యవసాయోత్పత్తుల కాంట్రాక్టులను ట్రేడింగ్‌కు ఆఫర్‌ చేస్తుంది. స్టాక్‌ స్వాప్‌ ద్వారా ఈ విలీనం జరగనుంది.

ప్రతిపాదన ప్రకారం విలీన ఎక్సే్ఛంజ్‌లో ఐసీఈఎక్స్‌ షేర్‌హోల్డర్లకు 62.8 శాతం, ఎన్‌ఎంసీఈ షేర్‌హోల్డర్లకు  37.2 శాతం వాటా వుంటుంది. ఐసీఈఎక్స్‌లో అనిల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీ రిలయన్స్‌ క్యాపిటల్‌ అతిపెద్ద ఇన్వెస్టరుకాగా, విలీనం తర్వాత కూడా ఈ కంపెనీ భారీవాటా కలిగిన ఇన్వెస్టరుగా కొనసాగనుంది. ఇరు ఎక్సే్ఛంజ్‌ల బోర్డులూ విలీనానికి ఆమోదముద్ర వేశాయి. నియంత్రణాపర అనుమతులకు లోబడి 2017 డిసెంబర్‌కల్లా విలీన ప్రక్రియ పూర్తవుతుందని అంచనా.

>
మరిన్ని వార్తలు