ఐఫోన్ ఎస్ఈకి యూఎస్ లో ఫుల్ క్రేజ్

11 Apr, 2016 17:15 IST|Sakshi
ఐఫోన్ ఎస్ఈకి యూఎస్ లో ఫుల్ క్రేజ్

భారత్ లో పేలవమైన స్పందన వస్తున్న యాపిల్ కొత్త మోడల్ ఐఫోన్ ఎస్ఈకి, అమెరికాలో మాత్రం ఫుల్ క్రేజ్ ఉందట. అక్కడ ఈ బ్రాండ్ కు అధిక డిమాండ్ పలుకుతుందని యాపిల్ కంపెనీ ఇన్ సైడర్ విశ్లేషకులు తెలుపుతున్నారు. యాపిల్ ఇన్ సైడర్ రిపోర్టు ప్రకారం యాపిల్ రిటైల్ అవుట్ లెట్స్ లో అన్ని మోడల్స్ విపరీతంగా అమ్ముడు పోతున్నాయని, యాపిల్ ఎస్ఈ స్టాక్ ను ముందుగానే కొనుగోలు చేస్తున్నారని పేర్కొంది.

న్యూయార్క్ లో ఉన్న యాపిల్ స్టోర్ లో ఐఫోన్ ఎస్ఈ స్టాక్ త్వరగా అయిపోతుందని, ముందస్తు ఆర్డర్ చేసి మరీ కొనుగోలు చేస్తున్నారని తెలిపింది. నాలుగు అంగుళాలు కల్గిన ఈ ఫోన్, ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్ లో కాని దొరకడం చాలా కష్టంగా ఉందని పేర్కొంది. కంపెనీ ఎప్పడికప్పుడూ స్టాక్ వివరాలు తెలుసుకుంటూ స్టోర్ ల్లో అందించాల్సిన బాధ్యత ఉందని తెలిపింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు