నోకియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లలో

2 Oct, 2018 12:36 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: నోకియా 7 సిరీస్‌లో మరోకొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయబోతోంది. నోకియా 7.1 ప్లస్‌ పేరుతో హెచ్‌ఎండీ గ్లోబల్‌  అక్టోబర్ 4 న  ఒక కార్యక్రమంలో దీన్ని ఆవిష్కరించనుందని భావిస్తున్నారు.  నోకియా 7.1 ప్లస్ 4జీబీ/64జీబీ స్టోరేజి,  6జీబీ/128 జీబీ స్టోరేజ్‌  రెండు వేరియంట్లలోతీసుకు రానుంది. రెడ్, బ్లూ, సిల్వర్  మూడు  కలర్ల ఆప్షన్లలో  ఈ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుంది.

అలాగే నోకియా 7.1ప్లస్‌ కూడా  నోకియా 6.1 ప్లస్‌, నోకియా 5.1 ప్లస్‌ తరహాలోనే  ఎడ్జ్‌-టూ-ఎడ్జ్‌ నాచ్‌ డిస్‌ప్లే, ఆల్‌-గ్లాస్‌ డిజైన్‌తో  రూపొందిందట.  ఒప్పో ఎఫ్‌ 9 ప్రొ , వివో 11 ప్రొ ఫోన్లకు ఇదిపోటీ ఇవ్వనుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.  తాజా అంచనాల ప్రకారం నోకియా 7.1 ప్లస్‌ అంచనాలు ఇలా ఉన్నాయి. మరోవైపు ఫిబ్రవరి 2019లో  జరగనున్న వరల్డ్‌  మొబైల్‌ కాంగ్రెస్‌లో నోకియా 9 స్మార్ట్‌పోన్‌ లాంచ్‌ చేయనుందని అంచనా. ముఖ్యంగా ఐదు కెమెరాలతో  ఈ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేయనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన నమూనా చిత్రాలు నెట్‌లో లీక్‌ అయ్యాయి

6.1 ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 19: 9 కారక నిష్పత్తి
1080x2280 పిక్సెల్ రిజల్యూషన్
ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌ డ్రాగెన్ 710 ప్రాసెసర్
12+5 డ్యుయల్‌ రియర్‌  కెమెరా
16ఎంపీ సెల్ఫీ కెమెరా
3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ
అంచనా ధర: 21,499  రూపాయలు

.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా