రెపో రేటును తగ్గించిన ఆర్‌బీఐ

4 Apr, 2019 12:13 IST|Sakshi
ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

ముంబై : సార్వత్రిక ఎన్నికలకు ముందు గృహ, వాహన, వ్యక్తిగత రుణాల కస్టమర్లకు ఊరట ఇచ్చేలా ఆర్‌బీఐ వరుసగా రెం‍డోసారి కీలక రేట్లను తగ్గించింది. రెపోరేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించి ఆరు శాతానికి పరిమితం చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో తొలిసారి మూడు రోజుల భేటీ అనంతరం ఆర్‌బీఐ కీలక రేట్ల నిర్ధారణ కమిటీ గురువారం వడ్డీ రేట్ల తగ్గింపును వెల్లడించింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. కాగా, అంతర్జాతీయ ఆర్థిక మందగమనం నేపథ్యంలో వృద్ధి రేటును ఉత్తేజింపచేసేందుకు ఆర్‌బీఐ రెపోరేటును పావు శాతం మేర తగ్గిస్తుందని పారిశ్రామిక వర్గాలు ఆశించాయి. ఆర్‌బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును రెపోరేటుగా పరిగణిస్తారు. రెపో రేటు తగ్గడంతో బ్యాంకులకు కేంద్ర బ్యాంక్‌ నుంచి తీసుకునే నిధులపై వ్యయం తగ్గడంతో అవి రుణ కస్టమర్లకు తక్కువ వడ్డీకి రుణాలిచ్చే వెసులుబాటు కలుగుతుంది. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో ఇప్పటికే రుణాలు పొంది నెలవారీ వాయిదాలు చెల్లించే కస్టమర్లకూ ఈఎంఐల భారం కొంతమేర తగ్గనుంది.

మరిన్ని వార్తలు