ఆర్థికమంత్రి భరోసా : షేరు రికవరీ

6 Mar, 2020 14:06 IST|Sakshi

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఖాతాదారులకు భరోసా

భారీగా   పుంజుకున్నయస్‌ బ్యాంకు షేరు

సాక్షి, న్యూఢిల్లీ: యస్‌బ్యాంకు సంక్షోభంపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చారు. ఆర్‌బీఐ ఆంక్షలు, డిపాజిటట్‌దారుల ఆందోళన నేపథ్యంలోశుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆర్థికమంత్రి డిపాజిట్‌ దారుల సొమ్ముఎక్కడికీ పోదనీ, పూర్తి భద్రంగా వుంటుందని హామీ ఇచ్చారు. ప్రతి డిపాజిటర్ డబ్బు సురక్షితంగా ఉందనీ, ఈ విషయంలో రిజర్వ్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తో తాను నిరంతరం మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. యస్‌ బ్యాంకు విషయంలో  ఆర్‌బీఐ సరియైన పరిష్కారాన్ని సాధ్యమైనంత త్వరంగా తీసుకుంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.  ముందుస్తు పరిష‍్కారంకోసం బ్యాంకింగ్‌ రెగ్యులేటరీ చాలా త్వరితగతిన  ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆర్థికమంత్రి హామీతో యస్‌ బ్యాంకు షేరు భారీగా కోలుకుం​ది. ఉదయం ట్రేడింగ్‌లో 85 శాతం కుప్పకూలి రూ.5.65 వద్ద  52 వారాల కనిష్టాన్ని నమోదు చేసింది.  అనంతరం పుంజుకుని ప్రస్తుతం రూ. 17 వద్ద కొనసాగుతోంది.

చదవండి :  చాలా వేగంగా చర్యలు, ఆందోళన వద్దు 

>
మరిన్ని వార్తలు