ఖాతాదారులకు ఆర్‌బీఐ భరోసా

8 Mar, 2020 20:12 IST|Sakshi

యస్‌ బ్యాంక్‌ సంక్షోభం నేపథ్యంలో ఖాతాదారుల నమ్మకాన్ని పెంచే విధంగా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుంది. ఆర్‌బీఐ  ఆదివారం ట్విటర్‌ వేదికగా ఖాతాదారులకు భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఓ బ్యాంకు ఆర్థిక స్థితిని సీఆర్ఏఆర్(క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ ఎస్సెట్స్) ఆధారంగా అంచనా వేయాలి. ఇది మార్కెట్ విలువపై ఆధారపడి ఉండదని ట్విటర్‌లో స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ ఆదేశాలతో యస్‌ బ్యాంకును ఆదుకోవడానికి ప్రభుత్వ రంగ సంస్థలైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. యస్‌ బ్యాంక్‌ సంక్షోభం నేపథ్యంలో ఖాతాదారులు బ్యాంకు నుంచి తీసుకునే సొమ్మును రూ. 50,000కు పరిమితం చేస్తూ రిజర్వ్‌ బ్యాంకు చర్యలు తీసుకున్న విషయం విదితమే.

>
మరిన్ని వార్తలు