బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నష్టం 1,407 కోట్లు

25 Jan, 2020 05:23 IST|Sakshi

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌  బరోడాకు ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) డిసెంబర్‌ క్వార్టర్లో భారీగా నష్టాలు వచ్చాయి.  గత ఆర్థి క సంవత్సరం క్యూ3లో రూ.436 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ3లో రూ.1,407 కోట్ల నికర నష్టాలు వచ్చాయని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎమ్‌డీ, సీఈఓ సంజీవ్‌ చంద్ర తెలిపారు. మొండి బకాయిలకు అధిక కేటాయింపులు జరపడంతో ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని వివరించారు. గత క్యూ3లో రూ.4,504 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు ఈ క్యూ3లో 47 శాతం పెరిగి రూ.6,621 కోట్లకు చేరాయి.

నికర వడ్డీ ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.7,128 కోట్లకు పెరిగింది. స్థూల మొండి బకాయిలు 10.91 శాతం నుంచి 10.43 శాతానికి, నికర మొండి బకాయిలు 4.79 శాతం నుంచి 4.05 శాతానికి తగ్గాయి. ఈ క్యూ3లో తాజా మొండి బకాయిలు రూ.10,387 కోట్లుగా ఉన్నాయి. దీంట్లో ఆర్‌బీఐ గుర్తించిన మొండి బకాయిల మళ్లింపులు రూ.4,509 కోట్ల మేర ఉన్నాయి. 

మరిన్ని వార్తలు