బ్యాంకులు వీక్‌ : నష్టాల్లో మార్కెట్లు

22 Mar, 2018 15:55 IST|Sakshi
స్టాక్‌ మార్కెట్లు డౌన్‌ (ఫైల్‌ ఫోటో)

ముంబై : అమెరికా ఫెడరల్‌ రిజర్వు.. వడ్డీరేట్లను పావు శాతం పెంచడం, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్లు బలహీనంగా ట్రేడవడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలు పాలయ్యాయి. అసలకే అస్థిరంగా ట్రేడవుతున్న మార్కెట్లకు, యూరప్‌ మార్కెట్లు బలహీనంగా ప్రారంభం కావడం తోడవడంతో మార్కెట్ల నష్టాలను మరింత  పెంచేలా చేసింది. చివరికి సెన్సెక్స్‌ 130 పాయింట్లు పడిపోయి 33,006 వద్ద, నిఫ్టీ 47 పాయింట్ల నష్టంలో 10,108 వద్ద ముగిశాయి. 

ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంకింగ్‌ షేర్లు, రియల్టీ రంగాలు ఎక్కువగా నష్టపోయాయి. నేటి ట్రేడింగ్‌లో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, మారుతీ సుజుకీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌లు 4 శాతం పడిపోగా.. ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టాటా మోటార్స్‌ 2 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 0.84 శాతం డౌన్‌ అయింది. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు లాభపడి 65.11గా నమోదైంది. 

>
మరిన్ని వార్తలు