లాభాల జోరు, 9400ఎగువకు నిఫ్టీ

11 May, 2020 09:55 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇతర ఆసియా షేర్లతో పోలిస్తే భారత మార్కెట్లు సోమవారం  పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి,  సెన్సెక్స్ 555 పాయింట్లు  పెరిగి 32198 వద్ద ఉండగా, నిఫ్టీ 50 ఇండెక్స్ 159 పాయింట్లు  లాభంతో 9410వద్ద ట్రేడవుతోంది.  ఆటో, మెటల్‌, బ్యాంకింగ్‌ రంగ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.  

మార్చి 31 తో ముగిసిన త్రైమాసికంలో ప్రైవేటు రంగ రుణదాత రూ .1221 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే 26.04 శాతం పెరిగింది.  కానీ ఐసీఐసీఐ బ్యాంకు  షేరు టాప్‌ లూజర్‌ గా వుంది. టాటా మోటార్స్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్ ,  మారుతి సుజుకి ఇండియా, రిలయన్స్‌ భారీగా లాభపడుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్,  నెస్లే  స్వల్పంగా నష్టపోతున్నాయి.  (కరోనా కల్లోలం: కార్మికుడు బలి)

మరోవైపు  కరోనావైరస్  మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా  కొనసాగుతున్న లాక్‌డౌన్‌ 3.0  మే 17న ముగియనున్న నేపథ్యంలో తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. 

మరిన్ని వార్తలు