లాభాల ప్రారంభం: రియల్టీ, ఆటో జంప్‌

7 Sep, 2017 09:44 IST|Sakshi

సాక్షి, ముంబై:  ప్రపంచవ్యాప్తంగా మెరుగుపడ్డ సెంటిమెంటు కారణంగా దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి.   ఒక దశలో లాభాల సెంచరీ సాధించిన సెన్సెక్స్‌ ప్రస్తుతం 83 పాయింట్లుఎగిసి 31, 475 వద్దకొనసాగుతోంది.అలాగే  ప్రారంభంలోనే 9,950 స్థాయిని అందుకున్న నిఫ్టీ ప్రస్తుతం 25  పాయింట్లు పెరిగి 9,941వద్ద ట్రేడవుతోంది. 

దాదాపు అన్ని రంగాలు పాజిటివ్‌గానే ఉన్నాయి. రియల్టీ, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ  లాభపడుతున్నాయి.  ఐబీ హౌసింగ్‌ 3.6 శాతం జంప్‌చేసి టాప్‌ విన్నర్‌గా ఉంది. ఐషర్‌, అదానీ పోర్ట్స్‌, ఐవోసీ, ఐసీఐసీఐ, డాక్టర్‌ రెడ్డీస్‌, భారతీ, మారుతీ, అరబిందో, అంబుజా,  పుంజులాయిడ్‌,హెచ్‌ఎఫ్‌సీఎల్‌  లాభాలను నమోదు చేస్తున్నాయి.   హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్‌ డీవీఆర్‌, బీపీసీఎల్‌ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.
 

>
మరిన్ని వార్తలు