ఏపీ, తెలంగాణ లలో స్వల్పంగా పెరిగిన చక్కెర ఉత్పత్తి

5 Feb, 2015 04:05 IST|Sakshi
ఏపీ, తెలంగాణ లలో స్వల్పంగా పెరిగిన చక్కెర ఉత్పత్తి

న్యూఢిల్లీ: 2014-15లో (అక్టోబర్-జనవరి) ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చక్కెర ఉత్పత్తి స్వల్పంగా పెరిగింది. గతేడాది 5.08 లక్షల టన్నులుగా ఉన్న చక్కెర ఉత్పత్తి ఈ ఏడాది 5.61 లక్షల టన్నులకు పెరిగిందని ఇండియన్ షుగర్ మిల్ అసోషియేషన్ (ఐఎస్‌ఎంఏ) తెలిపింది. చక్కెర ఉత్పత్తిలో మహారాష్ట్ర 30 శాతం వృద్ధితో (54 లక్షల టన్నులు) దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దీని తర్వాత 21 శాతం వృద్ధి (33.8 లక్షల టన్నులు)తో యూపీ రెండో స్థానంలో నిలిచింది. 22.7 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తితో కర్ణాటక మూడో స్థానంలో ఉంది. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలలో చక్కెర ఉత్పత్తి తగ్గింది.   

>
మరిన్ని వార్తలు