ట్యాగ్‌ నుంచి పేటెంటెడ్‌ టెక్నాలజీ

6 Aug, 2019 14:16 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లైవ్‌స్టాక్‌ టెక్నాలజీ కంపెనీ ట్రాపికల్‌ యానిమల్‌ జెనెటిక్స్‌ (ట్యాగ్‌) పేటెంటెడ్‌ టెక్నాలజీ ‘ట్రాపికల్‌ బొవైన్‌ జెనెటిక్స్‌’ను అందుబాటులోకి తెచ్చింది. పాడి రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా దీనిని అభివృద్ధి చేసినట్టు ట్యాగ్‌ ఎండీ ప్రవీణ్‌ కిని వెల్లడించారు. కంపెనీ కో–ఫౌండర్‌ ఆలూరి శ్రీనివాస రావు, ఫ్యూచర్‌ టెక్నాలజీ ఆర్కిటెక్ట్‌ బ్రూస్‌ వైట్‌లాతో కలిసి సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడారు.

‘భారత్‌లో ఆవు/గేదె ఏడాదికి సగటున 1,500 లీటర్లు ఇస్తుంది. మా టెక్నాలజీతో ఇది 4,000 లీటర్లకు చేరుతుంది. ఎంబ్రియో టెక్నాలజీ కారణంగా ఆవుల ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుంది. మరో విధానమైన ప్రెగ్నెన్సీ ఫ్రీ లాక్టేషన్‌ పద్ధతిలో ఆవు గర్భం దాల్చకుండానే పాలను ఇస్తుంది. ప్రతి ఏడాది ఒక ఇంజెక్షన్‌ ఇస్తే చాలు. పశువు జీవిత కాలం అంతా పాలను అందిస్తుంది. గుజరాత్‌లోని ఆనంద్‌లో ఏడాదికి ఒక లక్ష అండాలను అభివృద్ధి చేయగలిగే సామర్థ్యమున్న ప్లాంటు ఉంది. ఇటువంటి కేంద్రం ఒకటి తెలంగాణ లేదా అంధ్రప్రదేశ్‌లో నెలకొల్పుతాం. ఇప్పటికే కంపెనీలో రూ.56 కోట్లు వెచ్చించాం’ అని వివరించారు. 

మరిన్ని వార్తలు