పది పాసవ్వలేదు కాని పసిడి చొక్కా ధరించాడు

7 Aug, 2014 12:17 IST|Sakshi
పది పాసవ్వలేదు కాని పసిడి చొక్కా ధరించాడు
ముంబై: ధరలు చుక్కలంటుతున్న ప్రస్తుతం ఓ ఖద్దరు చొక్కా కొనుక్కోవాలంటేనే పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఓ వ్యక్తి ఏకంగా బంగారం పూతతో ఉన్న చొక్కాను ధరించి అందర్ని ఆకట్టుకున్నాడు. ఆ చొక్కా బరువు నాలుగు కిలోలు. ధర ఏకంగా కోటి 30 లక్షల (214,000 డాలర్లు) రూపాయలు. ముంబై నగరానికి 260 కిలో మీటర్ల దూరంలో ఉన్న యోలా లోని బంగారు బాబు పంకజ్ పరాఖ్ కనీస విద్యార్హత  పది తరగతి కూడ దాటలేదట. 
 
పది పాస్ కాని పంకజ్ మాత్రం దస్తుల వ్యాపారాన్ని ప్రారంభించి ఏకంగా బంగారు చొక్కాను ధరించే స్థాయి చేరుకోవడం చర్చనీయాంశం. యోలా వీధిలో ఎప్పుడు అడుగుపెట్టినా బంగారు చొక్కానే కాకుండా మూడు కేజీల నగలు కూడా ధరించి దర్జాగా తీరుగుతుంటాడు. గత శుక్రవారం జరిగిన 45వ జన్మదినానికి ప్రత్యేక అతిధుల జాబితా ఘనంగా ఉంది. 
 
బంగారు బాబు జన్మదిన కార్యక్రమానికి మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఛగన్ భుజ్ భల్,  ఓ డజను ఎమ్మెల్యేలు, సెలబ్రీటీలు తరలివచ్చారు. ఏడు బంగారు గుండీలున్న పంకజ్ బంగారు చొక్కా తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కింది.
మరిన్ని వార్తలు