కోడలి గురించి 'సుధామూర్తి' మనసులో మాట - ఏం చెప్పిందంటే?

11 Nov, 2023 18:20 IST|Sakshi

ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ 'సుధామార్తి' (Sudha Muthy) ఇటీవల తన కోడలు 'అపర్ణ కృష్ణన్‌' (Aparna Krishnan)తో ఎలా ఉంటుంది. కోడలి వల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా? అనే విషయాలను బయటపెట్టింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సూధామూర్తి కొడుకు రోహన్ మూర్తి మొదట్లో 'లక్ష్మీ వేణు'ను వివాహం చేసుకున్నాడు. కానీ వీరు ఎక్కువ రోజులు కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత రోహన్ 'అపర్ణ క్రష్ణన్' అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు

కొడుకు పెళ్లిని చాలా సింపుల్‌గా చేసినప్పటికీ.. కోడలిని మాత్రం బాగా చూసుకుంటుందని.. అపర్ణ క్రష్ణన్ గతంలో స్వయంగా వెల్లడించింది. తన అత్తగారి గురించి ఎవరైనా అడిగితే.. నాకు ఆమె రోల్ మోడల్ అని, అంతే కాకుండా ప్రతి అత్తకు రోల్ మోడల్ అని చెబుతానని చెప్పింది.

సుధామూర్తిని తన కోడలితో సంబంధం ఎలా ఉంటుంది అని అడిగితే, ఏ సమస్య లేదని చెబుతూ.. ఒకరినొకరు అపార్థం చేసుకోవడానికి చాలా సమయం కావాలని. నేను ఎప్పుడూ నా పనిలో బిజీగా ఉంటాను, ఆమె పనిలో ఆమె బిజీగా ఉంటుంది. అపర్ణ చాలా మంచిది, సమర్థవంతమైందిని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: సెలవు తీసుకోకుండా పనిచేస్తా.. దిగ్గజాలను భయపెడుతున్న కొత్త 'సీఈఓ'

సుధా మూర్తి ఇటీవల యూట్యూబ్‌లో 'సుధా అమ్మ' పేరుతో పిల్లల కోసం ఓ కొత్త యానిమేషన్ సిరీస్ ప్రారంభించింది. ఈ సందర్భంగా సుధామూర్తి 'కంటెంట్ నాదే కానీ ఇది అపర్ణ బేబీ'ది అని చెప్పింది. ఈ సిరీస్ ప్రారంభించడానికి కోడలి ఆలోచనే కారణమని కూడా వెల్లడించింది.

మరిన్ని వార్తలు